నేచురల్ స్టార్ నానీ బెస్ట్ పెర్ఫార్మరే కాక.. కథల్ని బెటర్ గా జడ్జ్ చేయగల కెపాసిటీ ఉన్నోడు కూడా. సాదీ సీదా పాత్రనైనా సరే.. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎంటర్ టైనింగ్ స్కిల్స్ తో, హ్యూమర్ టచ్ తో ప్రాణం పోయగల సత్తాకలిగినోడు. అందుకే ఎప్పటికప్పుడు అతడి సినిమాలు ప్రేక్షకుల్ని సమ్ థింగ్ స్పెషల్ అనుకొనేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో నానీ నటిస్తోన్న వెరైటీ కథాంశం కలిగిన మూవీ ‘టక్ జగదీష్’. నిన్ను కోరి, మజలీ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కదిలించిన శివ నిర్వాణ దీనికి దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను క్రిస్మస్ కానుకగా నేడు విడుదల చేశారు మేకర్స్. నానీ గెటప్ క్లాసీగా అనిపిస్తూనే మాసీ టచ్ తో ఉంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో .. సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ లా చక్కగా టక్ చేసుకొని మరీ భోజనం దగ్గర కూర్చున్నాడు నానీ . అయితే చొక్కా వెనకాల నుంచి మాత్రం ఒక కత్తి బైటికి తీస్తూ మరో కోణం చూపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను చూస్తుంటే.. ఇది కుటుంబ కథా చిత్రం లా అనిపించే ఫ్యాక్షన్ చిత్రమేమో అని సందేహం కలుగక మానదు. 2021 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘టక్ జగదీష్’ చిత్రంలో నానీ సరసన రీతూవర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు గా నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడని సమాచారం. నాజర్, ప్రియదర్శి, డేనియల్ బాలాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా నానీకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- నాని 2021లో మూడు సినిమాలతో సర్ ప్రైజ్