ఎన్నికల కమిషన్ ఏ పని చేసినా అడ్డుపుల్ల వేసి.. అగ్గిపుల్ల రాజేయడమే పనిగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఎదురే లేకుండా నడవాలనేది ఏపీ ప్రభుత్వ తీరు.. కానీ ఎన్నకిల కమిషన్, ఫిర్యాదుల కోసం ఈ-వాచ్ అనే యాప్‌ని విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వం ఖంగుతినింది. తమపై ఫిర్యాదులు వెల్లువెత్తుతాయని భయపడిందో ఏమో గానీ.. యాప్‌పై కోర్టు మెట్లెక్కింది. పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులను స్వీకరించడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఈ-వాచ్‌పైన ఫిర్యాదుల చిట్టాను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ-వాచ్ యాప్‌పై ఏపీ ప్రభుత్వం, హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కానీ, ధర్మాసనం లంచ్‌మోషన్‌ను తిరస్కరించి.. విచారణను రేపటికి వాయిదా వేసింది.
మా అభ్యంతరాలు మాకున్నాయి..
ఈ-వాచ్ తయారీలో ఎన్నో సమస్యలున్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్‌ను రహస్యంగా తయారు చేశారని.. ప్రభుత్వ వ్యవస్థలో యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. భద్రతాపరమైన సమస్యలు వల్ల, యాప్‌ను ఎవరైనా హ్యాక్ చేసే అవకాశాలు ఉండాలని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో వెల్లడించింది.పంచాయతీరాజ్‌శాఖ యాప్ ఉండగా ఈ-వాచ్ యాప్ ఎందుకనే ప్రశ్నను లేవనెత్తింది. కొన్ని పార్టీల లబ్ది కోసమే ఈ యాప్‌ను ఇంత రహస్యంగా రూపొందించి విడుదల చేశారని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
అసలేంటీ ఈ-వాచ్?
ప్రస్తుత కరోనా కాలం, అసలే రాజకీయంగా రణరంగంలా ఉంది ఏపీ. ఇలాంటి సమయంలో నేరుగా ఫిర్యాదులు చేసే పరిస్థితులు లేనందున వెబ్, మొబైల్‌లలో పనిచేసేవిధంగా ఎన్నికల కమిషన్ ఈ-వాచ్ పేరుతో+ ఒక యాప్‌ని రూపొందించింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని ఎన్నకల కమిషన్ తెలిపింది. బుధవారం ఈ-వాచ్‌ను ఎన్నకల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు.. దాని పురోగతి గురించి కూడా తెలుసుకోవచ్చని తెలియజేశారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను కేటగిరి ప్రకారం విభజించి పరిష్కరిస్తామని ఎస్‌ఈసీ తెలిపింది. మొబైల్‌లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ ‘ఈ-వాచ్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదుదారుడి ఐడెంటిటీని గుర్తిస్తామని చెప్పారు. ఫిర్యాదు వచ్చాక సీరియస్, నాన్ సీరియస్‌గా విభజింజి.. వాటిని పరిష్కరిస్తామన్నారు. ఫిర్యాదు సరిగా పరిష్కారం కాలేదనుకున్నవారు వారి ఫిర్యాదును ‘రీఓపెన్’ ఆప్షన్ ద్వారా తిరిగి అదే ఫిర్యాదును యాక్టివ్ చేయచ్చని పేర్కొన్నారు. యాప్ సెక్యూరిటీ ఆడిట్‌ను మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని, సెగ్రిగేషన్‌ను ఎస్ఈసీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని ఎస్‌ఈసీ తెలియజేసింది.
Must Read ;- నిమ్మగడ్డపై మరో అస్త్రం వదిలిన జగన్ సర్కారు