కోవిడ్ 19 సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఎవరిళ్ళల్లో వారుంటే.. ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు. బైటికొస్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి. ఈ మార్గదర్శక సూత్రాలతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి ‘బ్రేక్ ది చెయిన్’ అనే క్యాంప్ నిర్వహిస్తున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. అందులో భాగంగా మోహన్ లాల్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చాలా వెరైటీ గా ఎవేర్ నెస్ కలిగిస్తున్నారు.
మోహన్ లాల్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఒక వెరైటీ పోస్టర్ విడుదల చేశారు. ఇది కార్టూన్ రూపంలో ఉంది. అందులో ఆయన పడుకున్న రీతిలో రివీలయ్యారు. అందరూ ఇంట్లో సురక్షితంగా ఉంటే.. అదృష్టం యొక్క సైరన్ వినొచ్చు. అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను పోస్ట్ చేశారు. అంతేకాదు మాస్క్ ధరించండి, చేతుల్ని శానిటైజ్ చేసుకోండి. సామాజిక దూరం పాటించండి .. అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఆ ఫోటోకి తగిలించారు. ప్రస్తుతం బ్రేక్ ది చెయిన్ క్యాంప్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- మోహన్ లాల్ సినిమా విడుదలకు బ్రేకులేసిన సెకండ్ వేవ్