ప్రజలకు హైదరాబాద్ మెట్రో ఉగాదికి ప్రత్యేక కానుక అందించబోతోంది. సెలవు రోజుల్లో మెట్రో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం ఒక బంపర్ ఆఫర్ ని మెట్రో అధికారులు ప్రకటించారు.కేవలం 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ప్రయాణం చేసేందుకు సూపర్ సేవర్ కార్డును రూపొందించి విడుదల చేశారు.ఏడాది మొత్తంలో 100 రోజులు సెలవు దినాలను మెట్రో ప్రకటించనుంది , కేవలం ఆ సెలవు దినాల్లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఉగాది నాటి నుంచి ఈ సూపర్ సేవర్ కార్డులు హైదరాబాద్ మెట్రో విక్రయించనుంది. ఒకసారి ఈ కార్డు కొనుగోలు చేస్తే ఆ రోజంతా మెట్రోలో నగరంలోని ఎక్కడినుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా తిరగవచ్చని అధికారులు తెలిపారు.కరోనా తర్వాత ప్రయాణికులను మరింత ఆకర్షించేందుకు మెట్రో ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే మెట్రో తెచ్చిన ఆఫర్ తో హాలిడేస్ ఎంజాయ్ చెయ్యచ్చు అనే ఆనందం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
Must Read:-ఉగాది పచ్చడిలో ఆరోగ్య రహస్యాలు : తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! Ugadi 2021