ఆడవాళ్ల అందాన్ని వర్ణించేటప్పుడు సింహం లాంటి నడుము అంటుంటారు. సింహం నడుము సన్నగా నాజూకుగా ఉండటం వల్ల ఆడవాళ్ల నడుమును పోల్చేటప్పుడు అలా వాడారేమో. ఇప్పుడా నడుము ప్రస్తావన ఎందుకంటే నటి ఇలియానా నడుము కూడా అలానే ఉంటుంది. 2006లో హీరోగా రామ్ ని పరిచయం చేస్తూ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి ఆ సినిమా హీరోయిన్ గా ఇలియానాని ఎంచుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆ సినిమా ప్రారంభోత్సవం జరిగేటప్పుడే సినీ ప్రముఖులంతా అందాల సుందరిగా ఇలియానాకు ఓటేశారు.
ఆమెకు అవకాశాలూ అలాగే వచ్చాయి. మరి తన అందం గురించి ఇలియానాకు ఎలాంటి ఒపీనియన్ ఉందో చూద్దాం. తనసలు అందంగా లేనని ఆమె తెగ బాధపడిపోయేదట ఈ గోవా పాలకోవా. అలాంటి దిగులు ఆమెలో చాలా ఉండేదట. ఎలాంటి మనిషిలోనైనా ఏదో ఒక లోపం ఉండకుండా ఉండదు. లోపం లేకపోయినా లోపం ఉందని భావించే వారూ ఉంటారు. దాన్నే ‘బాడీ డిస్ మార్ఫియా’ అంటారు. ఇలాంటి ఫోబియాతోనే తన టీనేజ్ రోజుల్లో ఇలియానా బాధపడేదట. ఆడ వాళ్ల కొలతల్ని 36-28-36 అంటూ ఉండటం పరిపాటి. ఈ కొలతలు ఇలియానాకు చక్కగా సరిపోతాయి. అందుకే నిర్మాతలంతా ఆమె కోసం ఎగబడ్డారు.
అవకాశాలూ సన్నబడ్డాయి
కాలం ఒకేలా ఉండదు కదా.. క్రమేపీ ఆమెకు అవకాశాలు కూడా ఆమె లాగానే సన్నబడ్డాయి. ఇక ఫోబియా విషయానికి వద్దాం. కొంతమంది అమ్మాయిలు అందంగా ఉన్నా ఇంకా వారిలో ఏదో అసంతృప్తి వేధిస్తూనే ఉంటుంది. దాన్ని కవర్ చేయడం కోసం నానా తంటాలుపడుతుంటారు. అవసరమైతే దాని కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడరు. మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటే మరింత అందంగా కూడా కనిపిస్తాం. కొందరు ఆందోళన చెందుతూ అంద వికారంగా తయారవుతుంటారు. అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని కూడా అంటారు. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే ఇలియానాలో ఇప్పుడు అలాంటి అందం కనిపించడం లేదు.
బహుశా అది వయసు ప్రభావం కూడా కావచ్చు. ఆమెలో చోటుచేసుకున్న నిరాశా నిస్పృహల కారణంగా మొహంలో మార్పుకు కొంత కారణం కూడా కావచ్చు. మొత్తానికి ఇలియానా అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మనిషి ఎప్పుడు అందంగా కనిపిస్తాడో ఇలియానాకు బాగా తెలుసు. ‘జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తే మనసు నిర్మలంగా ఉంటుంది. అప్పుడే మనం అందగా కనిపిస్తాం. దీన్నచాలా మంది తెలుసుకోలేరు. నేను కూడా ఇలాంటి సమస్యతోనే సతమతమయ్యేదాన్ని. ఇప్పుడు నేనలా కాదు. నా అందంలోని పాజిటివ్ అంశాలనే చూసి మురిసిపోతున్నా. నా అందం చూసి గర్వ పడుతున్నా’ అంటోంది ఈ గోవా బ్యూటీ ఇలియానా.
అందుకే అద్దంలో కాకుండా అందంలోనే చూసుకోవడం బెటర్. అన్నట్టు మరిచాం సినిమాల్లోకి రాకముందు ఇలియానా మోడల్ కదా. అందుకే మన జుత్తు కు కలర్ విషయంలో కూడా మంచి సూచన చేసింది ఈ అమ్మడు. జత్తుకు మనం వేసే రంగు త్వరగా పోకుండా ఉండే రంగే మంచిదని, త్వరగా పోయే రంగులో ఎక్కువ కెమికల్స్ కలుస్తాయి అనుకోవడం నాన్సెన్స్ అంటోంది. పది నిమిషాల్లో జత్తును అందంగా చేసే ఇండికా హెయిర్ క్రీమ్ మంచిదని కితాబిస్తోంది. దానికి ఈమె ప్రచార కర్త కదా.. ఇలా అనక ఇంకెలా అంటుంది.
-హేమసుందర్ పామర్తి
Must Read ;- శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్