నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందు పంపిణీ చేసి తరవాత అన్ని జిల్లాలకు ఆనందయ్య మందు పంపించాలని భావిస్తున్నారు. ఇవాళ ఒక్క రోజే సర్వేపల్లి నియోజకవర్గంలోని 10 వేల మందికి ఆనందయ్య మందు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మందు పంపిణీ పూర్తి అయిన తరవాత ప్రతి జిల్లాకు 5 వేల ప్యాకెట్ల మందు పంపించనున్నట్టు ఆనందయ్య ప్రకటించారు.
కృష్ణపట్నంలో మందు పంపిణీ లేదు
కృష్ణపట్నంలో మందు పంపిణీ చేయడం లేదని ఆనందయ్య ప్రకటించారు. కరోనా మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని ఆయన విజ్ఙప్తి చేశారు.ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ పూర్తి చేసిన తరవాత, ప్రతి జిల్లాకు 5000 వేల మంది కరోనా రోగులకు మందు పంపిస్తామని ఆయన అన్నారు.జిల్లా అధికారులు కరోనా రోగులకు ఈ మందు ఉచితంగా అందిస్తారని ఆనందయ్య తెలిపారు.ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని, పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
చంద్రగిరిలో పీ రకం మందు తయారీ
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందయ్య కుమారుడితో పీ రకం మందును పెద్ద ఎత్తున తయారు చేయిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉచితంగా పీ రకం మందు పంపిణీ చేస్తామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.ఈ మందు కరోనా రాకుండా అడ్డుకుంటుందని ఆయన తెలిపారు.మిగిలిన మూడు రకాల మందులు తయారీ కానీ,పంపిణీ కానీ చేయడం లేదన్నారు.
Must Read ;- ఆనందయ్య మందు తయారీ అందరికీ నేర్పిస్తే మేలు : కేఏ పాల్











