బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ .. ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేశ్ భట్ కూతురన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలనటిగా బాలీవుడ్ లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. స్టూడెంట్ నెం. 1 తో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నఅమ్మడు.. కథానాయికగా ఇక వెనుదిరిగి చూడలేదు. బాలీవుడ్ లో టాప్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆలియా భట్.. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అమ్మడు తెలుగులో ఆర్.ఆర్.ఆర్ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. నటిగా తనను తాను ప్రూవ్ చేసుకొని మంచి పేరే తెచ్చుకున్న ఆలియా ఇప్పుడు తన తండ్రి ఇన్స్ పిరేషన్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై .. మంచి సినిమాలు తీయడానికి రెడీ అవుతోంది. తొలి ప్రయత్నంగా ఆలియా ‘డార్లింగ్స్’ అనే మూవీ నిర్మిస్తోంది. అయితే దీన్ని సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది.
షారుఖ్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో ఎటర్నల్ సన్ షైన్ సంస్థలు కలిపి నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన విశేషాల్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేసింది. ఇక ‘డార్లింగ్స్’ లో ఆలీయా భట్ తో పాటు షెఫాలీ షా, విజయ్ వర్మ, మలయాళ హీరో రోషన్ మ్యాథ్యూ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జెస్మిత్ కె రీన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ నెల లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
This one's special! 😊♥️
Announcing #Darlings, my first ever production under @EternalSunProd, in association with my fav @iamsrk’s @RedChilliesEnt!Starring the amazing @ShefaliShah_, @MrVijayVarma, @roshanmathew22
Directed by @djasmeet & produced by @gaurikhan, @_GauravVerma pic.twitter.com/JkeJmeIPjd— Alia Bhatt (@aliaa08) March 1, 2021