Interesting Titles Of Megastar Chiranjeevi Upcoming Movies :
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా ఓ పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ పాటను చిరంజీవి, చరణ్ లపై చిత్రీకరించనున్నారు. అయితే.. ఆచార్య చిత్రాన్ని దసరాకి విడుదల చేయనున్నారని ఓ వార్త.. కాదు సంక్రాంతికి విడుదల చేయనున్నారని మరో వార్త బయటకు వచ్చింది. అయితే.. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య విడుదల పై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిరంజీవి లూసీఫర్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే… చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల టైటిల్స్ బయటకు వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మూడు సినిమాలు ఏంటంటే.. మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేయబోయే వేదాళం రీమేక్, బాబీ డైరక్షన్ లో చేయబోయే సినిమా, మోహన్ రాజా డైరక్షన్ లో చేస్తున్న లూసిఫర్ రీమేక్. ఈ మూడు సినిమాలకు మూడు టైటిల్స్ ఫిక్స్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాల టైటిల్స్ ఏంటంటే.. లూసిఫర్ రీమేక్ కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను పిక్స్ చేసినట్లు ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.
వేదాళం రీమేక్ కు భోళాశంకర్ అనే పేరు పిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బాబీ సినిమాకు అయితే.. వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది. అయితే.. ఈ మూడు టైటిల్స్ లో భోళాశంకర్, గాడ్ ఫాదర్ టైటిళ్లు పక్కా ఫిక్స్ అయ్యాయని.. వాల్తేర్ వీరయ్య అన్నది ఇంకా డిస్కషన్ లో ఉందని తెలిసింది. ఏది ఏమైనా.. చిరు రీ ఎంట్రీ తర్వాత స్పీడు పెంచి ఇలా వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. అంతా అనుకున్నట్టుగా చిరు పుట్టినరోజుకు ఈ మూడు సినిమాల టైటిల్స్ అనౌన్స్ చేస్తే.. మెగా అభిమానులకు పండగే.
Must Read ;- గాడ్ ఫాదర్ గా సెట్ లో కాలు పెట్టిన చిరు











