బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆచార్య ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆచార్య తర్వాత సినిమాలు అంటూ చిరంజీవి మూడు సినిమాలను అనౌన్స్ చేశారు. అవి ఏంటంటే.. లూసీఫర్ రీమేక్, వేదాళం రీమేక్, డైరెక్టర్ బాబీతో సినిమా. ఈ మూడు సినిమాల్లో ముందుగా లూసీఫర్ రీమేక్ స్టార్ట్ కానుందని వార్తలు వచ్చాయి.
దీనికి మోహన్ రాజా దర్శకుడు. ఎన్. వి ప్రసాద్ నిర్మాత. ఆమధ్య పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత లూసీఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. చిరంజీవి డైరెక్టర్ బాబీతో చేయనున్నసినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు బాలీవుడ్ భామలు సోనాక్షి సిన్హా, బిపాసబసును సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఆచార్య తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ కాకుండా.. బాబీతో చేయనున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారట. కరోనా కారణంగా ఆగిన ఆచార్య సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత చిరంజీవి బాబీతో చేయనున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- చిరు సరసన బాలీవుడ్ భామలు.? ఇంతకీ ఏ సినిమాలో..?











