పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ తెరంగేట్రం చేయబోతున్నారా ? ఇప్పుడు ఇదే ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రను అకిరా నందన్ చేస్తున్నాడనే టాక్స్ సినీ వర్గాలలో వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గజదొంగగా నటిస్తుండగా..సినిమాలో ఆయన చిన్నప్పటి ఎపిసోడ్ ప్రధానంగా ఉండబోతోందట.ఈ క్రమంలో పవన్ చిన్నప్పటి పాత్రని అకిరా నందన్ తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు క్రిష్ భావించారట. అందులో భాగంగానే పవన్ అనుమతితో అకిరా నందన్ పాత్రని చాలా వైవిద్యంగా డిజైన్ చేశారట. అంతేకాదు ఆ పాత్రకు సంబంధించి పవన్ తో పాటు అకిరా ప్రాక్టీస్ కూడా చేశాడని సమాచారం.
ఇదిలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చి తమ సత్తాను చాటుకున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి పవన్ వారసుడు కూడా చెరబోతున్నాడు అనే టాక్స్ వినిపిస్తున్నాయి.ఇటీవల అకిరా నందన్ బాక్సింగ్ చేస్తున్న వీడియోస్ తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో అకిరా ఎంట్రీ వార్తలు మరింత జోరుగా పినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘వన్ నేనొక్కడినే’ మూవీలో మహేశ్ చిన్నప్పటి పాత్రను ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ చేయగా.. ‘రాజాది గ్రేట్’ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో.. ఆయన తనయుడు మహాధన్ కనిపించాడు. మరి ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో అకిరా నిజంగానే నటిస్తున్నాడో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.