ఓటిఎస్ పథకం తీరుతెన్నెలు .. !
ఓటిఎస్ పథకం పేద ప్రజల నుంచి ప్రత్యక్ష వసూళ్లకు పాల్పడుతోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలను ప్రజలు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా చెవిటివాడి ముందు శంఖం శబ్దం మాదిరిగా ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వం తీరు. 1983 నుంచి 2019 వరకు ఉన్న కాలమంతా రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు గృహ హక్కులు కల్పిస్తామని, ప్రజల ముందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. బిలో ప్రాపర్టీ లైన్ ( దారిద్య్ర రేఖకు దిగువన ) ఉన్న పేదలకు ప్రభుత్వం రుణాలను మంజూరు చేసి ఇళ్లు నిర్మిస్తే .. ఇప్పుడు జగన్ రెడ్డి ఆ రుణాలను మాఫి చేసి వాటిని మీ పేరు పై రిజిస్ట్రేషన్ చేస్తాం, అప్పుడు మీకు మీ గృహాలపై పూర్తిగా హక్కులు ఉంటాయి, ఆ తరువాత బ్యాంకు ఆ దస్త్రాలను తాకట్టుపెట్టుకుని రుణాలు కూడా పొందవచ్చునన్నది ఏపీ ప్రభుత్వ ప్రచారం. కానీ ప్రజలు ఈ పథకం అమలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఒత్తిడి చేయడం లేదంటూ ప్రభుత్వం చెబుతూనే .. జిల్లా కలెక్టర్లు నుంచి కిందిస్థాయి సచివాలయం సిబ్బంది వరకు ముక్కుపిండి ప్రజల వద్ద నుంచి ఓటీఎస్ ను పూర్తి స్థాయిలో అమలుపర్చాలని హుకూం జారీ చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు అని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
ఓటిఎస్ ద్వారా చేసే రిజిస్ట్రేషన్ల చెల్లవు .. చట్టాలు ఒప్పుకోవు!
ఓటిఎస్ ద్వారా సచివాలయంలో చేస్తానంటున్న రిజిస్ట్రేషన్లు చెల్లవని చట్టలు చెబుతున్నాయి. గ్రామ సచివాలయాల్లో చేసే ఓటిఎస్ రిజిస్ట్రేషన్లు రాజ్యాంగ విరుద్దం. జగన్ రెడ్డి బొమ్మతో తయారు చేసిన డాక్యుమెంట్లు అసలు చెల్లుబాటు కావు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం 3వ జాబితాల్లో అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా, సంయుక్తంగా ఉండే రిజిస్ట్రేషన్ అధికారులను నిర్దేశించబడి ఉన్నాయి. కాంకరెంట్ జాబితాలోని ఐటం నెం.6 ప్రకారం వ్యవసాయేతర భూమి బదలాయింపు, రిజిస్ట్రేషన్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఈ పరిథిలోకి వస్తాయి. రాష్ట్ర శాసన సభ, పార్లమెంట్ లోని నిబంధన లేదా జాబితాలో రూపొందించిన చట్టంలకు నేడు చేస్తున్న రిజిస్ట్రేషన్లు విరుద్దం. ఇది క్లాజ్ (2) లోబడి రాష్ట్ర శాసనసభ రూపొందించి చట్టం చెల్లదు. ఆర్టికల్ 254 కూడా అదే చెబుతోంది. దీని ప్రకారం ఓటీఎస్ రిజిస్ట్రేషన్లు చేసే అధికారాన్ని వార్డు, గ్రామ, సెక్రటేరియట్ లకు కల్పిస్తూ ఇచ్చిన జీవో 332 చెల్లుబాటు కాదు. అంతిమంగా జగన్ రెడ్డి బొమ్మతో తయారు చేసిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ చెల్లవుకాక చెల్లవు. రంగు కాగితాలతో తయారుచేసిన రిజిస్ట్రేషన్ పత్రాలకు చట్టబద్దత ఉండదు అన్నది సుస్పష్టం. అందుకే జగన్ రెడ్డి అండ్ కో, అధికారులు చెప్పే మాటలను నమ్మి, డబ్బులు చెల్లించి మోసపోకండి అని చర,స్థిరాస్తి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Must Read ;- బాధ పడుతున్న బొత్స..! అధికార పార్టీలో పెరుగుతున్న ధిక్కార స్వరాలు!!











