నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ నాయకుడికైనా పట్టేది అధోగతే!
నోరును అదుపులో పెట్టుకోకుండా అధికారం ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ రాజకీయ నాయకుడికైనా బూతు మంత్రి నానికి పట్టిన గతే పడుతోంది. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు .. ఏదైనా చెలాయించవచ్చునని భ్రమపడి పెత్తనం సాగిస్తే, చివరికి ఎవరైనా కాలం గర్భంలో కలిసిపోవాల్సిందే! విషయానికొస్తే.. బూతు మంత్రి నాని బెజవాడ కనదుర్గమ్మను దర్శించుకునేందుకు రోడ్డుపైకి వచ్చాడు. ఈ క్రమంలో మంత్రిగారు కారు రోడ్డుమీద ఆగింది. ఆ సమయంలో మంత్రి నానిని పార్టీ కార్యకర్తలు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. పాపం కోరస్ పలికేవార్ని ముందుగా ఏర్పాటు చేసుకోలేదు కాబోలు .. సిగ్గు విడిచి మరి .. జై నాని .. జై నాని అని అరవండి రా .. బాబు అంటూ సాక్ష్యాత్తు మంత్రే అడుకున్నాడు. పాపం సిగ్గు విడిచి అరవండి రా బాబు అని మంత్రే అభ్యర్థిస్తున్నాడని కాన్వాయి చుట్టూ ఉన్న కార్యకర్తలు గమనించినప్పటికీ … వారికేమి వినపడనట్లుగా పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో బూతుల మంత్రి నాని గారి గొంతు ఇక పెకలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను పట్టుకుని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పెట్టి ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఒక కేబినెట్ మంత్రి బయటికొస్తే హడావుడి మామూలుగా ఉండదు. అటువంటిది నాని బయటకొస్తే.. కనీసం కార్యకర్తలే జిందాబాద్ కొట్టలేని పరిస్థితి! దీనినిబట్టి నియోజకవర్గంలోని ప్రజల పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదుకుంటా!! ఏదో ఉద్దరిస్తాడని ఓటు వేస్తే, బూతులకే అధిక సమయమిచ్చి .. నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. ఇటువంటి నాయకుడికి జై కొట్టడం ఏమిటి సిగ్గు .. సిగ్గు అంటూ సోషల్ మీడియా కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. అధికారం ఇస్తే ..ఇది ఈ పిచ్చి సన్నాసుల చేసే పని అని ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
Must Read ;- వంశీ క్షమాపణ చెప్పారా? చెప్పించారా? తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్న రాజకీయం!











