Ruling Party In The Ruling Party In Uttarandra
అధికారపార్టీలో లుకలుకలు ఈనాటివి కావు..!
ఉత్తరాంధ్ర నుంచి అధికార పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పార్టీ పెద్దలు మితిమీరిన ప్రమేయం కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా ఇంటర్వ్యూల్లో, సొంత కేడర్ వద్ద వాపోతున్న సందర్భాలు కూడా కోకొల్లలు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో అధికారపార్టీ కార్యకలపాలను ఎంపీ విజయసాయి రెడ్డి చూస్తుంటారు. మూడు జిల్లాలో ఎంతో మంది సీనియర్లు వైసీపీలో కొనసాగుతున్నా..పెత్తనం మాత్రం విజయసాయిదే. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకే పరిమితంకాకుండా అధికార కార్యకలపాలు, కేడర్‌పై పెత్తనాలు చెలాయిస్తున్నారని ఎప్పటి నుంచో విజయసాయి పై ఉన్న ఆరోపణ. సీనియర్స్ ను సైతం పక్కన పెట్టి, వారి ప్రమోయం లేకుండానే కేడర్ కు ఆదేశాలివ్వడం, కేడర్ కు ఏమైన కావాల్సి వస్తే పట్టించుకోకపోవడం వంటి ఈ మూడు జిల్లాలో సర్వసాధరణంగా మారింది. పార్టీలో విజయసాయికి విస్తృత అధికారులిచ్చిన పర్వాలేదు .. మాపై పెత్తనం చేస్తే ఎలా? అని మంత్రులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మంత్రి బొత్స ఒకడుగు ముందుకు వేసి తనలోని అసంతృప్తిని వెల్లగక్కాడు. జాతీయ పార్టీ దృక్పంథాలు, ప్రాతీయపార్టీలో ఉండవనే చెప్పాడు బొత్స. విజయసాయి అనే వ్యక్తి కేవలం పార్టీ వరకే … కానీ మా కార్యక్రమాల్లో, పనుల్లో పెత్తనం చేయడం వంటి ఏమీ ఉండవని కొంత అసహనం వ్యక్తం చేశారు బొత్స.
Ruling Party In The Ruling Party In Uttarandra
అధిపత్యంతో నడుస్తున్న రాజకీయాలు
ఉత్తరాంధ్ర రాజకీయాలు ఎప్పుడూ చాపకింద నీరులా ప్రవహిస్తూ .. స్లో అండ్ స్టడీ ఉంటాయి. తేడా కొడుతోంది, ఉనికికే ప్రమాదం అనుకుంటే .. రివర్స్ గేర్ వేస్తారు. ఫలితంగా పార్టీలు భవితవ్యం తిరగపడుతోంది. అది ఏపీ ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఉత్తరాంధ్ర ను నాయకులు చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. అధికారపార్టీలో బొత్స, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని, అవంతి వంటి సీనియర్స్ ఇక్కడ గత 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. వైసీపీలో ఉన్న హేమాహేమీలను పక్కనపెట్టి, వారి ఆలోచనలతో ఏకభవించకుండా ఎవరెవరికో స్థానిక సంస్థల కోటలో పదవులు పందేరం చేస్తున్నారు విజయసాయి అన్నది ప్రధాన ఆరోపణ అయితే… మా ఇలాకాల్లో వీరి పెత్తనమేమిటి అని కూడా కొంత మంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. అసలు ఉత్తరాంధ్రలో మంత్రులు ఉన్నారా? అంటే .. ఎవరున్నారు? అన్న సమాధానాలు వినవస్తున్నాయి. అన్ని తానై నడిపిస్తున్న విజయసాయి రెడ్డికి కట్టుబడి పార్టీలో పనిచేయడం సీనియర్లకు ఇష్టంలేక కొన్ని కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారం, మంత్రి పదవులు ఈ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు అంత సంతృప్తినేమివ్వడంలేదు. పేరు మాది పెత్తనం విజయసాయిదా? అన్న అసంతృప్తే కేడర్లో అధికంగా కనిపిస్తోంది. 34 స్థానాలున్న ఉత్తరాంధ్రంలో విజయసాయి విస్తృత అధికారాలు, పెత్తనం వంటివి భవిష్యత్తులో అధికారపార్టీకి దెబ్బపడటం ఖాయంగానే కనిపిస్తోంది.
Must Read ;- జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఏపీ ఉద్యోగులు..! దెబ్బకు అలర్టైనా పోలీసులు!!