నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. బాలయ్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే.. ఈ సినిమాలో జై బాలయ్య అనే పాట.. ఆ పాటలో బాలయ్య షర్టులు మార్చి వేసే స్టెప్పులు అంతే ఫేమస్ అయ్యాయి.
ఇదిలా ఉంటే.. మలయాళ ముద్దుగుమ్మ నివేథా థామస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ భిన్నమైన పోస్ట్‌లు, వీడియోలు పెడుతూ సందడి చేస్తుంటుంది. తాజాగా అఖండ సినిమాలోని జై బాలయ్య పాటకు ఈ అమ్మడు స్పూఫ్ చేసింది. ఈ పాటలో బాలకృష్ణ షర్ట్ లు మార్చి వేసిన స్టెప్పును చేయాలని నివేదా ప్లాన్ చేసుకోగా అది కాస్త బెడిసి కొట్టింది. అయితే.. మొదటి షర్ట్ మారే వరకూ బాగానే ఉంది. రెండో షర్ట్ మారేటప్పుడు సరిగా రాకపోవడంతో లాగుతూ లాగుతూ నివేదా తమ్ముడు నిఖిల్ ఫ్రేమ్ లోకి వచ్చేశాడు. అది చూసుకోకుండా స్టెప్ పూర్తి చేసి వెనక్కి తిరిగింది నివేదా.
ఇంకేముంది వెనకాలే షర్ట్ లను లాగుతూ తమ్ముడు కనిపించడంతో ఒక్కసారిగా నవ్వేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా.. ఏది ఏమైనా అఖండ అనుభవం అదిరింది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Must Read ;- ఓటీటీ బిగ్ బాస్ షోకు హోస్ట నాగార్జునా..? బాలయ్యా?











