కరోనా వ్యాక్సిన్ వస్తుందనమాటే గానీ, అందరి మదిలో ఎన్నో సందేహాలు.. అసలు ప్రభుత్వం ఎలా అందించబోతుంది, ఎక్కడ తీసుకోవాలి, వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, సురక్షణ ఎంతమేర అందించగలవు.. ఇలా ఎన్నో అంతులేని ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో మెదలడం ఖాయం. కానీ, వాటికి సమాధానాలు ఎలా తెలుసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అటువంటి కొన్ని సందేహాలకు కేంద్రం సమాధానాలు చెప్పుకొచ్చింది. మరి వాటితో మీ సందేహాలు కూడా నివృత్తి అవుతాయోమో చూడండి..
మూడు వ్యాక్సిన్ల అభ్యర్థన
ఇప్పటికే సీరమ్ రూపొందిస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కొవ్యాక్సిన్, అమెరికా-జర్మన్ సంయుక్తంగా రూపొందించిన ఫైజర్ అత్యవసర సరఫరాకు అనుమతులు ఇవ్వాల్సిందిగా డిసిజిఐకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు వ్యాక్సిన్ కంపెనీలు సమర్పించిన ప్రయోగాల వివరాలను ఈ రోజు (డిసెంబర్ 19) పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. మరి డిసిజిఐ ఎటువంటి నిర్ణయం వెలవరించబోతుందని ప్రభుత్వం కూడా ఎదురుచూస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి కారణంగా మూడింటిలో మెరుగైన దానికి లేదా మూడు అనుకున్న అంచనాలను అందుకుంటే అనుమతులు అందించే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా సీరమ్ తయారుచేస్తున్న కొవిషీల్డ్ ధర కూడా సామాన్యలకు అనూకలంగా ఉండడంతో ప్రభుత్వం సైతం ఆక్స్ ఫర్డ్ టీకాపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించింది.
Must Read ;- కరోనా టీకా పంపిణీ చర్యలను ముమ్మరం చేసిన కేంద్రం
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా?
ఇది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. కరోనా రికార్డ్‌తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని కేంద్రం సూచిస్తుంది. అందుకోసం ముందస్తు జాగ్రత్తగా పేరు నమోదు చేసుకోవాలని సలహా ఇస్తుంది ప్రభుత్వం.
కరోనా వ్యాక్సిన్ అందుకోవడానికి అర్హతలు ఏంటి?
కరోనా వ్యాక్సిన్ తొలి దశలో డాక్టర్స్, హెల్త్ వర్కర్స్, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు అందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. హెల్త్ వర్కర్స్ విషయానికొస్తే, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి రాష్ట్రాల సహాయంతో జాబితాను సిద్ధం చేస్తుంది. ఇక సామాన్య ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి, అర్హత కలిగిన వ్యక్తుల మొబైల్ నంబర్లకు మెసెజ్ అందివ్వడం ద్వారా వారు ఎప్పుడు, ఎక్కడ వ్యాక్సిన్ అందుకోవాలో తెలియజేస్తుంది ప్రభుత్వం.
వ్యాక్సిన్ పొందలాంటే పేర్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలా?
కచ్చితంగా నమోదు చేసుకోవాలి. వారి అర్హతను ఓటరు జాబితా ద్వారా నిర్ధారణ చేసి, ప్రభుత్వం వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయా వ్యక్తులకు మొబైల్ ద్వారా అందిస్తుంది.
నమోదు చేసుకునే సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్స్?
మీ అర్హత గుర్తించడానికి డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చేయాలంటుంది ప్రభుత్వం. అందుకోసం భారతీయ గుర్తింపు కలిగిన ఏ డాక్యుమెంట్ అయినా సమర్పించవచ్చు. పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ కార్డు, పెన్షన్ కార్డ్, కేంద్రం లేదా రాష్ట్ర గుర్తింపు కార్డులు.. ఇలా ఏవైనా మీ వయసు, అర్హతను నిరూపించగలిగే వాటిని నమోదు సమయంలో సమర్పించడం తప్పనిసరి.
క్యాన్సర్, షుగర్, రక్తపోటు.. వంటి ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు కరోనా వ్యాక్సిన్ కి అర్హులా కాదా? ఒకవేళ వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి?
ఇలాంటి వ్యాధులు ఉన్నవారు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా బారిన పడడానికి, ఒకవేళ కరోనా బారిన పడితే కోలుకునే అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి జబ్బులున్న వారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే, వ్యాక్సిన్ సురక్షితమైనదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని తెలియజేసింది. జ్వరం, వ్యాక్సిన్ వేసిన చోట నొప్పి రావడం వంటివి కలగచ్చని తెలియపరిచింది.
విన్నారుగా.. ప్రభుత్వ సమాధానాలు.. మరి మీ సందేహాలు నివృత్తి అయినట్టేనా.. 50 ఏళ్లు పైబడినవారితోపాటు.. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా తొలిదశ టీకాకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాధి తీవ్రతను బట్టి వారికి అనుమతి లభిస్తుందని ప్రభుత్వం సూచిస్తుంది.
Alsao Read ;- అమెరికాలో మొదలైన వ్యాక్సినేషన్..