అమెరికా.. అగ్రరాజ్యంగా పేరు గాంచిన ఈ దేశం కొవిడ్-19 విషయంలో కూడా అగ్రస్థానాన్ని అందుకుంది. నేటికీ కేసులు, మరణాలు ప్రపంచ రికార్డులు సృష్టిస్తుంది అమెరికా. ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలనో లేక రాజకీయ కోణమో, చివరికి ఫైజర్ టీకా అత్యయిక సరఫరాకు అమెరికా ఫుడ్ & డ్రగ్ సంస్థ అనుమతించింది. అనుకున్నదే తడవుగా ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా 24 గంటల్లో వ్యాక్సిన్ అందిస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గ సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.
బయలుదేరిన ట్రక్కులు
మాటలు చెప్పడం కాదు.. ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఫైజర్ టీకాకు అనుకున్న సమయానికి అందించడానికి ట్రక్కులు బయలుదేరడం విశేషం. తొలి విడతలో భాగంగా 145 లొకేషన్స్‌ని ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో టీకాను ప్రజలకు అందించడం దగ్గర నుండి టీకాను సురక్షితంగా స్టోర్ చేయడం నుంచి అన్ని వసతులను అత్యవసరంగా, సమర్థంగా పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఈ లొకేషన్స్ పూర్తి చేసిన తర్వాత, ఆపై 636 కేంద్రాల్లో మంగళవారం, బుధవారం టీకా సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న డాక్టర్స్, హెల్త్ వర్కర్స్‌కు ముందుగా టీకా అందించడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. సంవత్సరం దాటుతున్నా.. కరోనా అమెరికాను పట్టి పీడిస్తుంది, ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా తయారయ్యాయి. వాటిని అరికట్టడానికి టీకా ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.
Must Read ;- టీకా పంపిణీకి కేంద్రం, రాష్ట్రాల అత్యవసర ఏర్పాట్లు
గర్భవతులు, పిల్లలపై ప్రయోగాల దిశగా అమెరికా
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టీకాలు ప్రయోగాలు చేస్తున్నా కూడా గర్భవతులు, పిల్లలపై ప్రయోగాలు మినహాయింపు ఇచ్చారు. వారిపై ప్రయోగాలు నిర్వహించడానికి ఏ ఆరోగ్య సంస్థ కూడా అనుమతులివ్వలేదు. ప్రస్తుతం అమెరికా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. గర్భవతులు, పిల్లలపై ప్రయోగాలు చేయడానికి సన్నగ్ధమవుతున్నట్లు తెలుస్తుంది. జనవరికి ప్రయోగాలకు కావాల్సిన అనుమతులు, వాలంటీర్లను సిద్ధం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
శాస్త్రవేత్తలు సైతం ప్రయోగాలు చేయనంత కాలం గర్భవతులకు టీకాను ఇవ్వలేం. కాబట్టి వారిని కూడ ప్రయోగాలలో భాగం చేసినప్పుడే వారికి అధికారకంగా నమోదైన టీకాను ఇవ్వగలం. కానీ అందుకోసం కొన్ని మార్గదర్శకాలు పాటించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రయోగ దశలో ఉన్న టీకాలను గర్భవతులు, పిల్లలపై ప్రయోగించడం మంచిది కాదు. అన్ని రకాలుగా సురక్షితమని ముద్ర టీకాను మాత్రమే వారిపై ప్రయోగం చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. టీకాకు సంబంధించిన పూర్తి డేటాను పరిశీలించి, అలాగే గర్భవతులు ఆరోగ్య పరిస్థితిని స్టడీ చేసి, ఆపై రెండింటిని పోల్చిన తర్వాతే వారికి టీకా ఇవ్వాలని సూచిస్తున్నారు. మామూలు వారిలాగా గర్భవతుల విషయం తీసుకుంటే అనర్ధాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు.
Also Read ;- అమెరికాలో ఫైజర్‌కు లైన్ క్లియర్