అగ్రరాజ్యంలో కరోనా టీకా పంపిణీ మొదలైన సంగతి తెలిసిందే. ఫైజర్‌కు అత్యవసర అనుమతులు లభించడం ఆలస్యం.. 24 గంటల్లోనే ఫైజర్ పంపిణీ మొదలవుతుందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదలు చేసి మరీ అత్యవసర ఏర్పాట్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేనా, టీకా మొదటి షాట్ ఇవ్వగానే తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదిక వ్యక్తం చేశారు. అమెరికా నిర్ణయం ప్రకారం మొదటగా డాక్టర్స్, హెల్త్ వర్కర్స్, ఆపై సాధారణ ప్రజలకు అందించడం ప్రారంభించాలనే ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వం. తాజా ప్రకటనలో అమెరికా పెద్దలకు టీకా అందించబోతున్నట్లు తెలియజేసిసంది.
మైక్ రేపు, బైడెన్ వచ్చే వారం
ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు రేపు (డిసెంబర్ 18) ఫైజర్ టీకా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అధికారక ప్రకటన విడుదల చేసింది. సాధారణ ప్రజలలాగానే టీకా అందుకోబోతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇలా పబ్లిక్‌గా తీసుకోవడం వల్ల ప్రజల్లో టీకా రక్షణ, సామర్థ్యాల పట్ల నమ్మకం ఏర్పడుతుందని తెలియజేశారు. ఇక వచ్చే వారం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఇవ్వబోతున్నట్లు కూడా తెలియజేశారు. తన ప్రచారంలో కొవిడ్‌ని కట్టడి చేయడం ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసిన బైడెన్, టీకా ప్రజలకు అందించడం ప్రారంభంకాగానే తన వంతు భాగం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Also Read ;- భారత్ కోసం ధర సవరించనున్న ఫైజర్
ప్రజల్లో అవగాహాన పెరుగుతుంది
ఇలా అగ్రరాజ్యపు పెద్దలు ఫైజర్ తీసుకోవడానికి ముందుకు రావడం వల్ల టీకా పట్ల ప్రజల్లోని అపోహలు, భయాలు పోగొట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. వీరితో పాటు మరికొందరు అధికారులు, పెద్దలు టీకా అందుకోవడానికి ముందుకు వస్తే ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ ముందునుండే తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.
Must Read ;- అమెరికాలో మొదలైన వ్యాక్సినేషన్..