పలుదేశాల్లో కొత్త కలవరం మొదలైంది. వ్యాక్సిన్ వచ్చింది.. ఇంకేం భయంలేదు అనుకుంటుంటే.. కరోనా తన రూపు మార్చుకుని సరికొత్తగా విజృంభించడం మొదలైంది. ఇప్పటికే బ్రిటన్ లాక్ డౌన్ ప్రకటించగా.. దక్షిణాఫ్రికా దేశంలో కరోనా కల్లోల్లాన్ని రేపుతుంది. పలు దేశాలు బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుండి వస్తున్న విమానాలపై నిషేదాలు విధించారు. జర్మని సైతం నిషేదాగ్నల దిశగా అడుగులు వేస్తుంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 60-70 శాతం కొత్తరకం కరోనా కేసులు నమోదవడంతో ప్రభుత్వాలు కలవరపడుతున్నాయి.
వ్యాక్సిన్ దేశాల్లో కరోనా కల్లోలం
ఇక్కడ కలవరపడాల్సిన విషయం ఏంటంటే వ్యాక్సిన్ అందిస్తున్న దేశాల్లో కరోనా కేసులు మామూలు రోజులకంటే ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. వ్యాక్సిన్ మొదలైన తర్వాత అమెరికాలో ఒక్కరోజులో దాదాపు 4 లక్షల కేసులు నమోదవ్వడం అక్కడ అధికారుల గుండెల్లో గుబులు రేపుతుంది. 1.14 లక్షలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఒక్క అమెరికాలోనే కాదు, రష్యాలో సైతం వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత కేసులు సంఖ్య పెరుగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీటితో పాటు పలు దేశాల్లో ఇదే తరహాలో కొనసాగుడడంపై శాస్త్రావేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.
అసలెందుకిలా?
సాధారణంగా ఏ టీకా ఇచ్చినా సరే జ్వరం లాంటి లక్షణాలు కనిపించడం సహజం. అది సర్దుకోవడానికి 48-72 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడం అవసరం. ఆ సమయం దాటిన తర్వాత మాత్రమే వ్యాధి నిర్థారణ చేయాలి. కానీ కొన్ని దేశాల్లో టీకా ఇచ్చిన 24 గంటలలోపే కరోనా టెస్టులు నిర్వహిస్తుండడం కూడా కరోనా కేసులు నమోదు సంఖ్య పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు.
Must Read ;- టీకా జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?