అమెరికాలో వ్యాక్సిన్ ప్రోమోషన్ కోసం అతిరథమహారధులందరూ పూనికుని మరీ ప్రజలకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్ వ్యాక్సిన్ను ప్రజలందరూ తిలకించేలా లైవ్లో తీసుకుని వ్యాక్సిన్ భద్రత గురించిన అనుమానాలను పటాపంచలు చేశారు. అంతేకాదు.. వ్యాక్సిన్ ప్రధాన్యత గురించి ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు కమలా హారిస్ వంతు వచ్చింది.
Today I got the COVID-19 vaccine. I am incredibly grateful to our frontline health care workers, scientists, and researchers who made this moment possible.
When you’re able to take the vaccine, get it. This is about saving lives. pic.twitter.com/T5G14LtFJs
— Kamala Harris (@KamalaHarris) December 29, 2020
మోడెర్నాను ఎంచుకున్న కమలా
అమెరికాలో మొదటి మహిళ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన కమలా వ్యాక్సిన్ అందుకుని మరొక సంచలనానికి తెర లేపారు. అందరూ ఫైజర్ను వ్యాక్సిన్ చేయించుకున్న తరుణంలో.. మోడెర్నా వ్యాక్సిన్ భద్రత గురించి, ప్రాముఖ్యత గురించి ప్రజల అనుమానాలను తీర్చే పనిలో పడ్డారు కమలా. అమెరికా ఎన్నికల ప్రచార సమయం నుండే కరోనా నుండి ప్రజలను కాపాడడమే తను మొదటి ప్రాధ్యాన్యం ఇస్తానని చెప్పుకొచ్చిన కమలా హారస్. వ్యాక్సిన్ ప్రచారంలో భాగంగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా అధికారకంగా తన ట్వట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేశారు కమలా. వ్యాక్సిన్ తీసుకునే అవకాశం వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నారు. ఇలాంటి అవకాశం రావడానికి కారకులైన డాక్టర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్కు ధన్యవాదాలు. వ్యాక్సిన్ తీసుకునే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు వ్యాక్సన్ తీసుకోండి.’ అంటూ తన ట్వట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు సందేశం అందించారు.
Must Read ;- ‘లైవ్’లో టీకా వేయించుకున్న జో బైడెన్