నిత్యం సవతి తల్లి చేతిలో దెబ్బలు తింటూ.. తనకు భవిషత్తనేది ఉందా అనుకున్న ఓ ఆడపిల్ల.. ఏకంగా రాష్ట్ర సిఎంకు దత్తపుత్రికగా మారింది. కేసీఆర్ అండతో నర్సింగ్ చదివి ఉద్యోగం పొంది తన కాళ్లపై తాను నిలబగే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఆ చక్కని చుక్కకు చూడ చక్కగా వివాహాం కూడా జరిగింది. అక్టోబర్‌లో చరణ్ రెడ్డి అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు (డిసెంబర్ 28) రంగారెడ్డి, పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో వైభవంగా వివాహాం జరిగింది.
పెళ్లికూతుర్ని చేసిన సిఎం సతీమణి శోభ..
విహహానికి ముందు పెళ్లి కూతుర్ని చేసిన సమయంలో కేసీఆర్ సతీమణి స్వయంగా హాజరై ప్రత్యూష పెళ్లి కూతుర్ని చేసే వేడుకల్లో పాల్గొన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ అతిధి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంతో శోభతో పాటు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కవిత కూడా హాజరయ్యారు. కేసీఆర్, శోభ తమ కుటుంబం తరపున సంప్రదాయబద్ధంగా తమ దత్తపుత్రికకు బహుమతులు అందించారు.
వైభవంగా ప్రత్యూష-చరణ్ రెడ్డి వివాహాం
హైదరాబాద్ రాంనగర్ కు చెందిన ఉడుముల జైన్ మేరీ-మర్రిరెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డి. ప్రత్యూష కుటుంబానికి వీరు బంధువులు కావడంతో.. ప్రత్యూషను తమ కుమారునికి వివాహాం చేయడానికి ముందుకొచ్చారు. అక్టోబర్ లో ఘనంగా నిశ్చితార్థం నిర్వహించారు. చరణ్ రెడ్డి అమ్మమ్మ ఊరిలో వివాహాం నిర్వహించాలని నిర్ణయించుకోవడంతో పాటిగడ్డలో వివాహానికి ఏర్పాట్లుచేశారు. రంగారెడ్డి జిల్లా, పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ మత సంప్రదాయంలో కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష-చరణ్ రెడ్డిల వివాహాం ఉదయం 10 గంటలకు ఘనంగా జరిగింది. ఈ వివాహానికి స్థానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Must Read ;- ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్