హీరోగా మారిన కమెడియన్ సప్తగిరి చాలా సినిమాలు చేశారు . ‘సప్తగిరి ఎల్. ఎల్. బి, సప్తగిరి ఎక్ష్ప్రెస్స్, వజ్ర కవచధార గోవిందా’ .. లాంటి సినిమాలు థియేటర్ లో కన్నా ఓ . టి . టి . ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువ ఆదరణ పొందాయి. ఈ మధ్య కాలంలో సప్తగిరి సైలెంట్ గా ఒక సినిమా ఓ.టి.టి కోసం రెడీ చేశారు. క్రైమ్ కామెడీ గా రూపొందిచిన ఆ సినిమా షూటింగ్ ఇటీవల మైసూర్ లోనే ఒక పురాతన దేవాలయంలో జరిగింది .
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?’ సినిమాకి కో డైరెక్టర్ గా పని చేసిన కుమార్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. హీరోగా మారినప్పటికీ సప్తగిరి .. అల్లరి నరేశ్ లా పూర్తి స్థాయి కామెడీ హీరో గా మారకుండా.. సునీల్ తరహాలో యాక్షన్ ఇమేజ్ ను కోరుకుంటూండడం విశేషం. అతడి లాస్ట్ రెండు సినిమాలు చూస్తే .. ఆ సంగతి అర్ధమవుతుంది. మరి సప్తగిరి కి ఈ సినిమా ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- ఎఫ్ 3 లో మూడో హీరో విషయాన్ని తేల్చేసిన డైరెక్టర్