‘కేజీఎఫ్’ సినిమా ఓ సంచలనం. ఈ మూవీ విజయంతో ‘దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్’ 2 రూపొందుతోన్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరో యశ్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘కేజీఎఫ్ 2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ‘కేజీఎఫ్’ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read ;- ‘కేజీఎఫ్ 2’ కొనేసిన మలయాళ స్టార్ హీరో.. !
అయితే.. ఈ టీజర్ ను ఇలా రిలీజ్ చేశారో లేదో.. యూట్యూబ్ లో అలా రికార్డులు మొదలుపెట్టేసింది. ఇప్పటి వరకూ లేని రికార్డ్ ను ఈ టీజర్ సొంత చేసుకుంది. ఇంతకీ ఏంటా రికార్డ్ అంటే.. ఇండియా లోనే ఫాస్టెస్ట్ 2 మిలియన్స్ లైక్స్ సాధించిన టీజర్ గా నిలిచింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన వెంటనే అభిమానులు దీనిమీద దండయాత్ర చేశారని చెప్పొచ్చు. పది గంటల ముప్పై నిమిషాలకే ఈ టీజర్ రెండు మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోగా, కోటి యాభై లక్షల మంది టీజర్ ను చూశారు. ఇక 24 గంటల్లో ఈ టీజర్ ఏకంగా 78 మిలియన్ వ్యూస్ కు పైగానే సొంతం చేసుకుంది.
ఈ టీజర్ కి ఇంతటి ఆదరణ రావడానికి కారణం ఏంటంటే.. ప్రతి పాత్రను ఎంతో పవర్ఫుల్ గా తీర్చి దిద్దారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. హీరో యశ్ రాకీ భాయ్ పాత్ర లో ఇంకా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. టీజర్ లో వచ్చే డైలాగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. చరిత్ర మనకు చెప్పింది, శక్తివంతమైన వారు శకివంతమైన ప్రాంతాల నుండి వస్తారు అని, కానీ.. చరిత్ర తప్పు చెప్పింది. శక్తివంతమైన వారు ప్రాంతాలను మరింత శక్తివంతంగా చేస్తారు అనే డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజరే ఇంతలా ఆకట్టుకుని రికార్డులు సాధిస్తుంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
Must Read ;- టీజర్ టాక్ : పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కేజీఎఫ్ 2’











