మహాత్మా గాంధీ హంతకుడిగా గాడ్సే పేరు అందరికీ తెలుసు. అందుకే ఎవ్వరూ గాడ్ సే పేరు బహిరంగంగా మాట్లాడుకోవడానికి సైతం ఇష్టపడరు. దానివల్లే గాడ్ సే వెనుక విషయాలను, నేపధ్యం తెలుసుకునే ప్రయత్నం అంతగా జరగలేదు.గాడ్సే కేవలం ఒక నేరస్తుడు మాత్రమే కాదు. ఒక పత్రికా సంపాదకుడు..అగ్రణి, హిందు రాష్ట్ర పత్రికలకు సంపాదకుడిగా కూడా పనిచేశారు.. బాల్యం నుంచే స్థిరమైన అభిప్రాయాలు కలిగిన గాడ్సేని పూర్తిగా అర్థం చేసుకోకపోతే భారతదేశ చరిత అర్థం కాదనేది మా అభిప్రాయం అని అంటున్నారు ’గాడ్సే మరణ వాంగ్మూలం ` చిత్ర బృందం.
గాంధీ హత్య నేపథ్యంలో భారతదేశంలో ఒక నవల కానీ ఒక సినిమా కానీ రాలేదు. దానిని దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను తెలియజెప్పాలనే గాడ్సే `మరణ వాంగ్మూలం` చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు హిందీ భాషల్లో దీనిని నిర్మించనున్నాం డిసెంబర్ లో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రం నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది.
చిత్ర దర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ, “గాడ్సే లోపలి భావాజాలాన్నిఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో మత సామరస్యం ఉండాలనే కోరుకుంటున్నాం. అదే సమయంలో .బహిరంగంగా గాడ్సే గురించి చెప్పబోతున్నాం. అంతా కొత్తవారితో ఈ సినిమా చెయ్యబోతున్నాను. రెండేళ్లు ఈ సినిమా కోసం పరిశోధన చేశాం. గోపాల్ గాడ్ సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభభవించాడు, 2005లో అతను చనిపోయాడు. గాంధీ హత్యలో అతని ప్రమేయం తదితర అంశాలను మేము తీయబోయే సినిమాలో చూపించడం జరుగుతుంది“ అని అన్నారు.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, “గాడ్సే రాసిన పుస్తకం ఆలోచింపజేస్తుంది. గాడ్సే కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. దానిని చుస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో స్పష్టంగా తెలుస్తుంది. ఆయన విలన్ ఎలా అయ్యాడనే అంశాలను భరద్వాజ్ ఈ చిత్రంలో చూపబోతున్నారు. ఆసక్తికరమైన ఈ చిత్రం కోసం నేను ఎదురుచూస్తున్నా“ అని అన్నారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ…నిర్మాత సూరజ్ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో మొదలు పెట్టి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం. త్వరలో ఈ చిత్రం నటీనటుల, సాంకేతిక నిపుణుల వివ్లరాలను తెలియజేస్తాం అని చెప్పారు.
Must Read ;- నిమ్మకూరు వెళ్లగానే అయోధ్యలో అడుగుపెట్టిన భావన కలిగింది











