టీడీపీని రెచ్చగొడితే, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని మంత్రి కొడాలి నానికి బాలయ్య తీవ్ర హెచ్చరికలు చేశారు. మా సహనాన్ని పరీక్షించవద్దు, మేం ఉత్తుత్తి మనుషులం కాదని బాలయ్య హిందూపురం టూర్ లో హెచ్చరించారు. అవసరం అయితే చేతల్లో కూడా చూపిస్తాం, తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. గుడివాడల పేకాట శిబిరాలపై కూడా బాలయ్య స్పందించారు. పేకాట ఆడితే ఉరి శిక్షవేస్తారా రూ.10 వేలు ఫైన్ కట్టి బయటకు వస్తారంటూ మంత్రి కొడాలి వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని బాలయ్య విమర్శించారు.
రైతులకు రాయితీలు అందడం లేదు
రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బాలకృష్ణ తప్పుపట్టారు. అధిక వర్షాలకు పంట నష్టమలనలరపోయిన రైతులకు పరిహారం ఇవ్వక పోగా,కనీసం ఇన్ పుట్ రాయితీలు కూడా చెల్లించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతులు రూ.17000 కోట్ల పంట నష్టపోతే ప్రభుత్వం రూ.275 కోట్లు ఇచ్చిందని ఆయన విమర్శించారు. దేవాలయాలపై దాడులను బాలయ్య తీవ్రంగా ఖండించారు. అన్ని మతాలను గౌరవించాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
Must Read ;- మంత్రి కొడాలి నానికి జగన్ తలంటారా?