ఏటా వందలమంది మృత్యువాత పడుతున్న కన్పిచడం లేదా?
గుంటూరు జిల్లాలో పేరేంచర్ల టూ కొండమూడు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు కోడెల శివరాం తలపెట్టిన పాదయాత్రను అడ్డుకున్నారు. ‘చంద్రన్న ఆశయ సాధన’ పేరుతో సత్తెనపల్లి నుంచి దేవరంపాడు కొండ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం వరకు పాదయాత్రకు పిలుపునిచ్చారు కోడెల. ఎన్నో ఏళ్లుగా పేరేంచర్ల నుంచి కొండమూడు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు నోచుకోలేదు. ప్రతి ఏటా ఈ రోడ్డు పై జరిగిన ప్రమాదాల్లో వందల సంఖ్యలో వాహనదారులు మృత్యువాత పడుతుంటారు. తెలుగు దేశం ప్రభుత్వం హయంలో రూ.200 కోట్లతో ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ నాడు ప్రాధమిక దశలో ఆగిపోయిన రోడ్డు పనులు నేటికి కార్యరూపం దాల్చలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అధికార వైసీపీ తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఇప్పటిల్లో ఆ రోడ్డును పట్టించు దాఖాలాలు కనిపించడంలేదు. దీంతో సత్తెనపల్లి టీడీపీ నాయకులు కొడెల శివరాం పాదయాత్ర నిర్వహించి, ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశాడు.
అడుగడుగునా ఆంక్షాలు.. ప్రశ్నిస్తే అరెస్ట్లా!?
పేరెంచర్ల టూ కొండమూడు రోడ్డు పనులను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని, కోడెల శివరాం తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసు అడ్డుకున్నారు. దీంతో శనివారం ఉదయం నుంచే సత్తెనపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది! పాదయాత్రకు సిద్దమైన కోడెలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని పోలీసుల తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోడెల శివరాంను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. అలానే టీడీపీ రాజుపాలెం మండల అధ్యక్షుడు అంచుల నరసింహారావు, టీడీపీ ముఖ్య నాయకులను, నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రోడ్డు పనులను తాత్సారం చేస్తూ.. ప్రజలకు నరకయాతన చూపుతున్నారని టీడీపీ మండిపడితోంది! రహదారుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని తెదేపా నేతలు ప్రశ్నింస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read:-తాడిపత్రిలో రగులుతున్న రాజకీయం! తగ్గేదేలే అంటున్న టీడీపీ!!











