లేడీ అమితాబ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది విజయశాంతి. పదమూడు సంవత్సరాల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో విజయశాంతి తన పాత్రకు తగ్గట్టుగా నటించి మరోసారి అందర్నీ మెప్పించింది. ఈ సినిమా తర్వాత తన వయసు తగ్గట్టు పాత్రలు వస్తే.. నటించడానికి తాను సిద్దమే అని చెప్పారు. దీంతో రాములమ్మ ఇక వరుసగా సినిమాలు చేస్తుంది అనుకున్నారు. అంతే కాకుండా.. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, విజయశాంతి మధ్య జరిగిన సంభాషణ అందరికీ గుర్తుండే ఉంటుంది.
చిరంజీవి మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దామనడం.. దీనికి విజయశాంతి కూడా ఓకే అనడం తెలిసిందే. దీంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదని తెలిసింది. చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందుచేత ఈ సినిమా కాకపోతే మరో సినిమాలో అయినా సరే.. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించడం ఖాయం అనుకున్నారు మెగా అభిమానులు. కాకపోతే ఇప్పుడు విజయశాంతి షాక్ ఇచ్చింది.
అది ఏంటంటారా..? సినిమాలకు ఇక పూర్తిగా దూరం అవ్వాలి అనుకుంటున్నారు. ఈ విషయాన్ని విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో సినిమాల పై ఇప్పుడు ఆసక్తి లేదు. ఇక నుంచి పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నాను. ఓ వైపు సినిమా, మరో వైపు రాజకీయం.. ఇలా రెండు పడవల మీద ప్రయాణం కుదరదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు. ఆమెతో సినిమాలు చేయాలనుకునే వారికి.. ఆమె కోసం క్యారెక్టర్స్ రాసుకుంటున్న వారికి ఇది షాకే అని చెప్పచ్చు.
Must Read ;- రాములమ్మ పోరాటమూ చంద్రబాబుపైనేనా..











