క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ.. గత కొంత కాలంగా కెరీర్ లో బాగా వెనబడ్డారు. ఆయన నుంచి సరైన సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే… సినిమా ద్వారా ఏదైనా మంచి చెప్పాలి అనుకుంటారు. ఎంత మంది సినిమా చూసి ఫాలో అవుతారు. ఎంత మందిలో మార్పు తీసుకువస్తుంది అనేది పక్కనపెడితే.. ఓ మంచి సినిమా తీశాం.. ఓ మంచి విషయం చెప్పమనే సంతృప్తి ఇస్తుంది. అందుకనే సినిమా ద్వారా ఏదైనా చెప్పాలనుకుంటారు కృష్ణవంశీ. అలా.. ఆలోచించే మంచి దర్శకుడు కృష్ణవంశీ కొంత గ్యాప్ తర్వాత మరాఠీలో విజయం సాధించిన నటసామ్రాట్ చిత్రాన్ని తెలుగులో ‘రంగమార్తాండ’ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.
ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇళయారాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కరోనా ముందు చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు జనవరి నుంచి తిరిగి సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. కృష్ణవంశీ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా మూవీ చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకటి కాదు ఏకంగా రెండు పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో ఒకటి జనవరి నుంచి సెట్స్ పైకి రానున్నట్టు సమాచారం.
అయితే.. ఇందులో ఎవరు నటించనున్నారు.? ఈ చిత్రానికి నిర్మాత ఎవరు.? అనేది తెలియాల్సివుంది. ‘గులాబి, నిన్నేపెళ్లాడతా, అంతఃపురం, సింధూరం, ఖడ్గం’.. ఇలా విభిన్న కథా చిత్రాలతో క్రియేటీవ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న కృష్ణవంశీ ‘రంగమార్తండ’ సినిమాతోను అలాగే ఇప్పుడు ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా మూవీస్ తో మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి.. కొత్త సంవత్సరంలో కృష్ణవంశీ ‘రంగమార్తండ’ సినిమాతో సక్సస్ సాధించి ఫామ్ లోకి వస్తారని ఆశిద్దాం.
Must Read ;- ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో రమ్యకృష్ణ?