Ks Jawahar Counter To Narayanaswamy Challenge :
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఇప్పుడు నిజంగానే ఏదీ కలిసి రావడం లేదు. తనకు జగన్ అప్పగించిన అబ్కారీ శాఖపై నారాయణస్వామికి ఏ రీతిన కూడా పట్టు దొరకడం లేదు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం పేరిట జగన్ పార్టీ ఘనంగా ప్రకటించింది. ఇప్పుడేమో ఆ శాఖ ద్వారా వస్తున్న ఆదాయాన్ని అంతకంతకూ పెంచేసుకుంటూ సాగుతున్నారు. దీనిపై ఏ రీతిన సమర్థించుకోవాలో నారాయణ స్వామికి అర్థం కావడం లేదు. దీనికి తోడు అవినీతి ఆరోపణలతో ఆయన సతమతమవుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడే దిశగా నారాయణ స్వామి ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకే తెలియడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆయన నోట నుంచి టీడీపీ టార్గెట్‌గా వచ్చిన ఓ సవాల్ ఆయనను అడ్డంగా బుక్ చేసి పారేసింది.
బాబు ఇంటిలో పాకీ పని..
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందినవారే నారాయణస్వామి. కుప్పం నుంచి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తుంటే.. గంగాధర నెల్లూరు (ఎస్సీ) నుంచి నారాయణ స్వామి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడేమో కేబినెట్ పునర్వవస్థీకరణ దిశగా సాగుతున్న జగన్.. ఎక్కడ తన పదవిని పీకుతారోనన్న భయం నారాయణస్వామిని వెంటాడుతోంది. ఈ క్రమంలో తనను తాను సేఫ్ జోన్ లోకి నెట్టుకునే దిశగా.. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆయన బుధవారం ఓ సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేశ్ లు ఏ పార్టీతో పొత్తు లేకుండా రెండు సీట్లు గెలిస్తే.. చంద్రబాబు ఇంటిలో తాను పాకీ పని చేస్తానని నారాయణ స్వామి సవాల్ విసిరారు. ఈ కామెంట్లు వైరల్ అయిపోయాయి.
జవహర్ అదిరేటి కౌంటర్
నారాయణ స్వామి కామెంట్లు విన్నంతనే టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ అదిరిపోయే రీతిలో రివర్స్ అటాక్ చేశారు. నారాయణ స్వామి సవాల్ ను ప్రస్తావిస్తూ.. డిప్యూటీ సీఎంకు పాకీ పనే శాశ్వతం అవుతుందని చురకలు అంటించేశారురు. ఈ సందర్భంగా జవహర్ ఏమన్నారంటే.. ‘‘సవాళ్లతో పాకీ పని కుదిరితే అదే శాశ్వతమవుతుంది. టీడీపీ ఇచ్చిన మాటకు నిలబడుతుంది. మీరు ఇచ్చిన మద్యపాన నిషేధం సంగతేంటో తేల్చాండి. సవాళ్లు మాని శాఖపై దృష్టి పెట్టండి’’ అంటూ జవహర్ అదిరిపోయే రీతిలో నారాయణ స్వామికి కౌంటర్ ఇచ్చారు. టీడీపీకి సవాల్ విసురుతూ నారాయణ స్వామి సవాల్.. దానికి ప్రతిగా జవహర్ సంధించిన కౌంటర్ ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- వైసీపీని వీడి.. టీడీపీ వైపుగా దళితులు











