జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. డిసెంబర్ 1 పోలింగ్ డే కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. ప్రచార పర్వాల్లో అధికార, విపక్ష పార్టీలు ఒకరినొకరు అభివృద్ధిపై సవాళ్లు విసురుకుంటున్నాయి. ప్రజలు కూడా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై సంధించిన ప్రశ్నల తాలుకు ఫోటోలు ప్రస్తుత ఎన్నికల సందర్భంలో వైరల్ అవుతున్నాయి. 2016 ఎన్నికల్లో హుస్సేన్ సాగర్, మూసీ నదిపై కేటీఆర్ ఇచ్చిన హామీల సంగతి ఏమైందని పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అయితే నెటిజన్లు వేసిన ప్రశ్నలతో కూడిన ఫోటోలు క్యా హువా కేటీఆర్? పేరుతో సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Also Read:-జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ.. ‘జగన్’ నినాదం!
మూసీ నీళ్లు తాగొచ్చా కేటీఆర్ సార్?..
గత ఎన్నికల సందర్భాల్లో మూసీ నది, హుస్సేన్ సాగర్ సుందరీకరణ, అవినీతి నిర్మూలన, లక్ష డబులు బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి కేటీఆర్ హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హామీలు పూర్తయ్యాయా? కేటీఆర్ గారు అంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్‌లో ఇలా ప్రశ్నించారు. ‘మూసీ నది, హుస్సేన్ సాగర్ గురించి గత ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు మేము మూసీ నది నీళ్లు తాగొచ్చా సార్? హుస్సేన్ సాగర్‌లో రూపాయి సిక్క వేస్తే మాకు కనిపిస్తదా? హుస్సేన్ సాగర్ వెనుకాల గ్రాఫిక్స్ బిల్డింగ్స్ ఎటుపాయె? లక్ష డబుల్ బెడ్‌రూమ్ లు ఏవి?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇలా నాటి ఎన్నికల హామీలపై నెటిజన్లు కేటీఆర్‌కు ప్రశ్నించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలవుతున్నాయి.
Also Read:-100 కోసం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘గులాబీ’ స్కెచ్!
