ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. నంద్యాలలో అబ్దుల్ సలాం ఉదంతం మరవక ముందే గుంటూరు సమీపంలోని లాంలో ముస్లిం మత పెద్ద మౌజమ్ హనీఫ్ పై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు దాడికి తెగబడ్డారు. ముస్లింల శ్మశానవాటికలో వైసీపీ నేతల అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు హనీఫ్ పై దాడికి దిగారు. దీంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ హనీఫ్ సెల్పీ వీడియో విడుదల చేసి కనిపించకుండా పోయారు. దీంతో వైసీపీ నేతల అరాచకాలు మరోసారి వెలుగుచూశాయి.
Also Read:-గుంటూరులో చెలరేగిపోతున్న గుట్కా మాఫియా..
పోలీసులేం చేస్తున్నారు
ముస్లిం మతపెద్ద మౌజమ్ హనీఫ్ పై దాడి జరగ్గానే ఆయన పోలీసులను ఆశ్రయించి దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో హనీఫ్ మనస్తాపానికి గురయ్యారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగరాదని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వీడియో పోస్ట్ చేసి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది.
ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది ?
ముస్లింలు, దళితులపై వైసీపీ శ్రేణులు ఎన్ని దాడులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకే ఇలాంటి సంఘటనలు తరచూ జరగుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. మౌజమ్ హనీఫ్ పై దాడిచేసిన వారిపై హత్యాయత్నం కింద కేసుపెట్టి, కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలపై ఎన్ని దాడులు జరుగుతున్నా, బాధితులు చనిపోతున్నా ముఖ్యమంత్రి మౌనంగా ఉండబట్టే, వైసీపీ కార్యకర్తలు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారని రఫీ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:-ఆ మహిళా ఎమ్మెల్యే చుట్టూ అనేకానేక వివాదాలు!
ఈసారి తాడికొండ ఎమ్మెల్యే అనుచరుల వంతు
లాం ఖబరస్తాన్ లో అక్రమంగా మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్న వారిని అడ్డుకున్నందుకు మౌజమ్ హనీఫ్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. అయితే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టికోకపోవడంతో ముస్లిం మత పెద్దలు హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఒత్తిడి వల్లే పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సామాన్యులు జీవించే హక్కును వైసీపీ నేతలు కాలరాస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి, హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ముస్లిం మతపెద్దలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:-తాడికొండ ఎమ్మెల్యేకు కొత్త శత్రువు











