ఒడిశాలో దారుణం..
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి జర్నలిస్ట్ మృతి చెందిన ఘటన ఒడిశాలోని కలహందీలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ రోహిత్ కుమార్ మృతి చెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలిందని పోలీసులు వెల్లడించారు. ఒడిశాలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కుర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు. ఆ పోస్టర్లును కవర్ చేసేందుకు వెళ్లిన రోహిత్ కుమార్.. ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు వేశారు. ఈ క్రమంలో మందుపాతర పేలి అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వెంటనే కలహందీ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. రోహిత్ మదన్‌పుర్ – రామ్‌పుర్ వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్తాప్తు చేపట్టారు.
Must Read:-చీమకుర్తికి చైనా పావురం.. గూఢచర్యానికేనా??











