గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో అరాచకం చోటు చేసుకుంది. పోతుమర్రులో సలీం అనే కౌలు రైతు ఆరెకరాల పొలం తీసుకుని వరి పంట సాగు చేశాడు. సలీం కౌలు ఒప్పందం మే నెల వరకూ ఉంది. అయితే గ్రామానికి చెందిన భూ యజమాని, వైసీపీ నేత ఒకరు సలీంను పొలం ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో ఖరీఫ్ వరి పంట కోతకు వచ్చే సమయంలో పొలం ఖాళీ చేస్తే రూ. 3 లక్షల నష్టం వస్తుందని సలీం వాపోయాడు. పొలం అమ్ముకోవాలి వెంటనే ఖాళీ చేయాలని వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడంతో సలీ రెండు కత్తులతో పొడుచుకున్నాడు. పోలీసులు వెంటనే ఆపడంతో ప్రమాదం తప్పింది.
పంట కాజేసే ప్రయత్నం..
వైసీపీ నేతలు తన పంటను కాజేయాలని చూస్తున్నారని కౌలు రైతు సలీం ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని పెట్టి పంటను కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆత్మహత్యకు పాల్పడినట్టు సలీం వెల్లడించారు. కౌలు రైతు కత్తులతో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో వైసీపీ నేతలు వెనక్కు తగ్గారని తెలుస్తోంది. మైనారిటీలపై వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఇప్పటికైనా దాడులు ఆపాలని వైసీపీ నేతలకు విజ్ఙప్తి చేశారు
Must Read ;- వైసీపీ నేతల దౌర్జన్యం.. తెదేపా నాయకులకు తీవ్ర గాయాలు