వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండాపోతుంది. న్యాయాన్యాయాలు పక్కనపెట్టి తాము చెప్పిందే న్యాయం లేదంటే వేధింపులు తప్పవు అన్నట్లుగా ఉంది వైసీపీ నాయకుల వ్యవహారం. తాజాగా జరిగిన సంఘటన అందుకు అద్దంపడుతోంది. భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో, ఆమెతో కలిసుండడం అసాధ్యమని భావించాడో భర్త. ఇంతలో భార్య తరపున అధికార పార్టీ వైసీపీ నాయకురాలు రంగ ప్రవేశం చేసింది. భర్తను బెదిరించడం మొదలుపెట్టడం. వీటిని తట్టుకోలేని ఆ భర్త ఆత్యహాత్యాయత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వినకుంటే అక్రమ కేసులు
కృష్ణ జిల్లా, అల్లూరు గ్రామనికి చెందిన షేక్ సయ్యద్ భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాదు, ఈ మధ్య ప్రియునితో వెళ్లి పోయింది. ఇంతలో కంగారు పడిన సయ్యద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, వాళ్లని పోలీసులు పట్టుకుని స్టేషన్‌కి రప్పించారు. కేసు నమోదు చేయకుండా, కుటుంబ పెద్దలతో తేల్చుకోండంటూ పంపించేశారు.
ఈ నేపథ్యంలో భార్య తరపున వైసీపీ నాయకురాలైన మాజీ జెడ్పీటీసీ సభ్యరాలు షహనాజ్ బేగం రాజీ కుదర్చడానికి ప్రయత్నించింది. భర్త దగ్గరే ఉంటానని భార్య చెప్పడంతో ఆమెని తీసుకెళ్లాల్సిందిగా సదురు నాయకురాలు చెప్పింది. ఇలాంటి భార్య తనకు వద్దంటే వద్దని సయ్యద్ తేల్చి చెప్పడంతో బెదిరింపుల పర్వానికి తెర లేపారు వైసీపీ నాయకురాలు. భార్యకు తీసుకెళ్లకపోతే వేధిస్తున్నావని రివర్స్ లో సయ్యద్ పైన కేసు పెడ్తామని బెదిరించారు.
Also Read ;- దందాలు ఆగకుంటే కష్టం.. వైసీపీ పెద్దల ఆందోళన!
ఆత్మహత్యాయత్నం
ఈ మొత్తం వ్యవహారంతో భయపడిన సయ్యద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి చనిపోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సయ్యద్‌ను నందిగామలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ల సమాచారం ప్రకారం, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఎక్కువవుతున్న ఆగడాలు
అధికారం ఉందనే పేరుతో మాజీలనీ లేదు, అధికారం ఉన్నవారని లేదు.. వైసీపీ అయితే చాలు అందరినీ భయపెట్టచ్చు అన్నట్లుంది వైసీపీ నాయకుల వ్యవహారం. టోల్ గేట్ దగ్గర గొడవ, హాస్పిటల్ లో దందా, మీడియా సమావేశంలో భూతులు.. ఇప్పుడేమో ఏకంగా ప్రాణాల మీదకి తెచ్చారు. ఇంత జరుగుతున్నా.. అధిష్టానం మందలించడం లేదు. అదుపు చేయాలని కనీస ప్రయత్నం చేయడం లేదు.
Must Read ;- వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే…