తనకు దక్కాల్సింది దక్కలేదనే ఫ్రస్టేషన్లో ఉన్న టైములో పిలిచి పిల్లనిచ్చినట్లు పదవినిచ్చారు. దీంతో ఉప్పొంగిపోయి.. అసలు జగన్ అంటే దేవుడన్నట్లు.. దేవుడి బిడ్డ అన్నట్లు బిల్డప్ తనే ఊహించేసుకుని.. అదే తన కొలీగ్స్‌కి ఎక్కించడమే కాక.. జనానికి కూడా అదే చెప్పుకొచ్చాడాయన. తీరా రోజలు గడిచే కొద్దీ ఆ దేవుడి స్క్రిప్ట్ తట్టుకోలేకపోయారు. దేవుడి దూతలమంటూ కొందరు షాడో డీజీపీలా వ్యవహారం చేస్తుంటే దిక్కులు చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఏ స్టేషన్‌లో ఏ కేసు బుక్ చేయాలో.. ఏ కేసు వదిలేయాలో.. ఎవడిని లోపలేయాలో.. ఎవరిని బయటకు పంపాలో.. అంతే వాళ్లే డిసైడ్ చేస్తుంటే.. కళ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు. మొదట్లో కాస్త సమర్ధించుకుంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినా.. స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలతో మీడియాకు మొహం చూపించడానికి కూడా మొహమాటపడే స్టేజికి వెళ్లిపోయారు.
డైరెక్షన్ వైసీపీ నేతలదే..
మొదట్లో ఈయనేం డీజీపీ అని మండిపడ్డవారు సైతం.. ఇప్పుడు పరిస్ధితులు చూసి పాపం గౌతమ్ సవాంగ్ అనుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో డైరెక్షన్ వైసీపీ నేతలదైనా యాక్షన్ మాత్రం పోలీసులదే. ప్రత్యర్ది పార్టీ క్యాండేట్లను బెదిరించాలన్నా పోలీసులే… వారిపై ఉన్న పాత కేసులేంటో తిరగేసి లోపలేయాలన్నా పోలీసులే.. కొత్త కేసులు పెడతామని బెదిరించాలన్నా పోలీసులే.. ఇలా పోలీసులను ఇంతలా వాడిన పార్టీ వైసీపీ తప్ప మరోటీ లేదంటే ఆశ్చర్యం లేదు. బీభత్సంగా పై నుంచి కింది దాకా పోలీసులను తెగ వాడేసుకుంటున్న వైసీపీ నేతలను ఏమీ అనలేక.. తన స్టాఫ్ కు ఏం చెప్పాలో తెలియక.. అటు జగన్ గారికి ఏమీ చెప్పుకోలేక.. చెప్పలేక.. సతమతమైపోయి.. ఈ ఎన్నికలు అయిపోగానే సెలవు పెట్టి వెళ్లిపోదామని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం టైములోనే డీజీపీ అవుతారని ప్రచారం..
తెలుగుదేశం టైములోనే డీజీపీ అవుతారని ప్రచారం జరిగింది. విజయవాడ కమిషనర్‌గా ఉన్నప్పుడే డీజీపీ ఎంపిక ప్రక్రియ నడిచింది. సార్ పేరు బాగా వినపడింది. లోకల్ మీడియాకు అయితే ముందే చెప్పి.. నెగెటివ్ వార్తలు నాలుగు రోజులు ఆపాలని కబురు కూడా పెట్టారు. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు.. చివరి క్షణంలో ఠాకూర్ వచ్చి డీజీపీ అయిపోయారు. ఈ విషయంలో లోకేష్ పాత్ర ఉందని చెబుతుంటారు. ఏమైనా సవాంగ్ బాగా హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన సవాంగ్‌ను వైసీపీ ఎన్నికల ముందే వాడేసిందని చెబుతుంటారు. డిపార్ట్‌మెంట్ కదలికలన్నీ అందించారని కూడా అంటుంటారు. అవి ఎంత నిజమో తెలియదు. కాని జగన్ గెలవగానే.. సవాంగ్‌ను పిలవడం.. నువ్వే డీజీపీ అనటం.. జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా తనకు సంబంధం లేకపోయినా వెళ్లి నేరుగా మానిటరింగ్ చేయటంతో అందరికీ విషయం అర్ధమైపోయింది.
ఇప్పుడు పరిస్ధితి దారుణం
కట్ చేస్తే.. ఇప్పుడు పరిస్ధితి దారుణంగా తయారైంది. ఒకవైపు ప్రతి జిల్లాలోను, ప్రతి ఏరియాలోనూ వైసీపీ నేతల వత్తిడి పెరిగిపోయింది. కానిస్టేబుల్ నుంచి డీసీపీ వరకు పార్టీ వాళ్ల రికమెండేషన్‌తో బదిలీలు చేయాల్సి వచ్చింది. అయినా సర్దుకుపోయాడు గౌతమ్ సవాంగ్. కాని దాని వల్లే ఇప్పుడు వారంతా వైసీపీ వారి మాటలే వింటున్నారు. డీజీపీ ఆఫీసు నుంచి ఏమడిగినా.. ఏం చేయమంటారు సార్.. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నారు, మంత్రిగారు అడుగుతున్నారని అటు నుంచి సమాధానం. గట్టిగా నిలదీస్తే సజ్జల గారు చెప్పారని ఫైనల్ ఆన్సర్. ఇక ఆ తర్వాత అడగటానికి ఏమీ ఉండదు కదా. అందుకే తీవ్ర ఆవేదనలో ఉన్న గౌతమ్ సవాంగ్ త్వరలోనే సెలవులో వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Must Read ;- టీడీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు.. డీజీపీకి చంద్రబాబు లేఖ