సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రీసెంట్ గా దుబాయ్ లో మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. పలు కీలకమైన సన్నివేశాల్ని, యాక్షన్ సీక్వెన్సెస్ ను ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరించారు. ఇక రెండో షెడ్యూల్ ను హైద్రాబాద్ గా రీసెంట్ గా మొదలు పెట్టారు. కానీ దానికి కరోనా సెకండ్ వేవ్ బ్రేకులేసింది.
దాంతో జూన్ నుంచి తదుపరి షెడ్యూల్ ను మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాదు ఓ పాటతో ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారట. దానికి గోవాని నేపథ్యంగా ఎంపిక చేశారట. సెకండ్ షెడ్యూల్ ను పూర్తిగా గోవాలోనే ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ లో ఒక స్పెషల్ సాంగ్, అలాగే.. కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారట. భారత బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన భారీ కుంభకోణం నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది.
దానికి తగ్గట్టుగానే సినిమాలో భారీ యాక్షన్, ట్విస్ట్ లు , రొమాన్స్ పుష్కలంగా ఉంటాయట. ఇక ఇందులో కీర్తి సురేశ్ కి, మహేశ్ కి మధ్య వచ్చే లవ్ ట్రాక్ సినిమాకే ప్రత్యేకంగా నిలిచిపోతుందట. అది అభిమానుల్ని బాగా అలరిస్తుందట. మైత్రీ మూవీ మేకర్స్, జీయంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సర్కారు వారి పాట సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.
Must Read ;- పెర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ .. స్వీయ నిర్బంధంలో మహేశ్ బాబు ఫ్యామిలీ