Manickam Tagore Issues Legal Notices To Sudheer Reddy :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడి మొదలెట్టేశారు. ఇందులో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. ఈ తరహా దూకుడుతో సుధీర్ రెడ్డి ఇప్పుడు నిజంగానే చిక్కుల్లో పడిపోయారని చెప్పాలి. ఎందుంకటే.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని డబ్బు పెట్టి కొనుక్కున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు కదా. రేవంత్ ఆ డబ్బును వేరే ఎవరికో కాకుండా టీ పీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న మాణికం ఠాకూర్ కు ఇచ్చారని సుధీర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడే సుధీర్ రెడ్డి బుక్కైపోయారని చెప్పాలి.
జాగ్రత్త లేకుంటే ఇంతే మరి..
సాధారణంగా రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలకు పెద్దగా ఆధారాలేమీ ఉండవు. అయితే మనం ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎలాంటి వారన్న విషయాన్ని చూసుకుని మరీ మైకు ముందుకు వెళితే బాగుంటుందన్నది సీనియర్ రాజకీయవేత్తల సూచన. అయితే ఈ విషయంలో సుధీర్ రెడ్డి కాస్తంత తొందరపాటుతో పాటు దానికి తనదైన శైలి దూకుడును యాడ్ చేసి.. రేవంత్ పై విరుచుకుపడి ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. రేవంత్ పై విమర్శలు సంధించేందుకు వచ్చి తనను అవినీతి పరుడిగా నిలబెడితే సహించేదెలా? అన్న కోణంలో మాణికం ఠాగూర్ ఇప్పుడు ఓ రేంజిలో ప్రతిదాడిని మొదలెట్టారు. ఈ దాడికి తట్టుకుని నిలబడే సామర్థ్యం సుధీర్ వద్ద ఉన్నా.. మాణికం పట్టుదల చూస్తుంటే.. సుధీర్ రెడ్డి సారీ చెప్పక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సారీకి వారమే టైమంట
అయినా మాణికం ఠాగూర్ ఇప్పుడు సుధీర్ రెడ్డిపైకి ఎలాంటి దండయాత్ర చేయబోతున్నారంటే.. పరువు నష్టం దావా వేసేదాకా ఆ హస్తం పార్టీ నేత వెళ్లబోతున్నారట. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించేందుకు రూ.25 కోట్లు తీసుకున్నారంటూ సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన అసత్య ఆరోపణలపై లిఖతపూర్వకంగా, భేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ సుధీర్ రెడ్డికి ఆయన లీగల్ నోటీసు పంపారు. సుధీర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి ఆరోపణలతో మాణికం ఠాగూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, వారం రోజుల్లోగా ఆయన లిఖిత పూర్వక సమాధానం చెప్పాలంటూ ఠాగూర్ తరపు న్యాయవాది ఆర్.రవీంద్రన్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకుంటే కోటి రూపాయల పరువునష్టం దావాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అందులో మాణికం ఠాగూర్ హెచ్చరించారు.
Must Read ;- రెండేళ్లలో కాంగ్రెస్ కు అధికారమే లక్ష్యం: రేవంత్