Shruti Haasan :
అందం, అబినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో శృతిహాసన్ ఒకరు. అనగనగా ఓ థీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆతర్వాత ఓ మై ఫ్రెండ్ సినిమాలో కూడా నటించింది. అయితే.. శృతి హాసన్ కు సక్సస్ అందించిన సినిమా మాత్రం గబ్బర్ సింగ్. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తున్న శృతి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. చెప్పాలనుకున్నది ఏదైనా సరే.. ముక్కసూటిగా చెప్పేస్తుంది. ఇటీవల ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.
అది ఏంటంటే… తన ముక్కుకు జరిగిన సర్జరీ గురించి నిజం ఒప్పుకుంది. తాజాగా తన బోయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి సోషల్ మీడియా లైవ్ చాటింగులో పాల్గొంది. అయితే.. శృతి హాసన్ కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. అది ఏంటంటే.. మీ బాడీలో మీ ముక్కు మీకు ఇష్టమైనదేనా? అంటూ నెటిజన్ చాలా తెలివిగా మెలిక పెడుతూ ప్రశ్నించగా.. ఏమాత్రం తడుముకోకుండా ఎస్ అని చెప్పింది. అవును.. నా ముక్కు నాకు బాగా ఇష్టం.. ఎందుకంటే నా శరీరంలో నేను ఎక్కువ ఖర్చు చేసింది దాని బాగుకే కదా అంటూ నవ్వేసింది శృతిమాసన్.
విషయం ఏంటంటే.. శృతి హాసన్ ముక్కుకు చిన్నప్పుడు గాయం అవ్వడం తో దానికి సర్జరీ చేయించారు. ప్రమాదంలో గాయానికి లండన్ లో శస్త్ర చికిత్సను చేయించారు. అలాగే కథానాయిక అయ్యాక కూడా శృతిహాసన్ ముక్కును సరి చేయించుకుందన్న ప్రచారం జరిగింది. అయితే తన జీవితంలో జరిగే ఏ విషయాన్ని దాచుకునేందుకు ఇష్టపడని శృతి ప్రతిదీ ఓపెన్ గానే వెల్లడించేస్తోంది. మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయాక డిప్రెషన్ లోకి వెళ్లిన శృతి నెమ్మదిగా కోలుకుంటోంది. క్రాక్ సినిమాతో సక్సస్ సాధించిన శృతి ఆతర్వాత వకీల్ సాబ్ మూవీతో కూడా సక్సస్ సాధించింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ సలార్ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తుంది.
Must Read ;-సలార్ రెండు పార్ట్ లుగా రాబోతుందా..?











