మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత చిరు పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డి చేసారు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లోను ఓవర్ సీస్ లోను సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తనయుడు రామ్ చరణ్ నిర్మించారు. అయితే.. చరణే నిర్మాత అయినప్పటికీ.. ఈ సినిమాకి గాను చిరు రూ. 40 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నారట.
సైరా నరసింహారెడ్డి తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకి గాను చిరంజీవి రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. 2021 సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరు చేయనున్న మూవీ వేదాళం రీమేక్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
స్ర్కిప్ట్ రెడీ చేసి.. చిరు ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి మెహర్ రమేష్ రెడీగా ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి గాను చిరంజీవి రూ. 60 కోట్లు రెమ్యూనరేషన్ గా ఫిక్స్ చేశారట. దీనికి అనిల్ సుంకర ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. చిరు సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయం. మరి.. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- నిహారిక పెళ్ళి వేడుకల్లో ప్రత్యేకార్షణగా నిలిచిన చిరు