మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే.. నవంబర్ లో ఈ మూవీ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నిహారిక పెళ్లికి చిరు వెళ్లడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. అలా.. ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ లు పడడం వలన సమ్మర్ రేసు నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వచ్చాయి. దీంతో చిరు ఫ్యాన్స్ సమ్మర్ కి ‘ఆచార్య’ రావడం లేదా అని డీలాపడ్డారు. తాజా వార్త ఏంటంటే… ఈరోజు నుంచి మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

చిరంజీవి ఈ మూవీ షూటింగ్ లో సంక్రాంతి తర్వాత నుంచి జాయిన్ అవుతారు అనుకున్నారు కానీ.. ఈ రోజు నుంచి మళ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. క్లైమాక్స్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ రోజు నుంచి చిరంజీవి పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తాజా షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జనవరి నుంచి ‘ఆచార్య’ షూటింగ్ లో జాయిన్ అవుతారు. చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. అయితే.. చరణ్ సరసన నటించే హీరోయిన్ గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా ఎవరనేది ఫైనల్ కాలేదు.
మార్చి ఎండింగ్ కి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమాని మే 7న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఈ మూవీ షూట్ లో జాయన్ అయి.. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాలి అనుకుంటున్నారట. వరుస విజయాలతో దూసుకెళుతున్న కొరటాల ఆచార్య సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారని గట్టిగా వినిపిస్తోది. మరి.. ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఏస్ధాయి విజయం సాధిస్తుందో చూడాలి.
Must Read ;- చిరు కొత్త సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందట.. !
https://www.youtube.com/watch?v=G42qHGGNDK0











