గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ఎంఐఎం తొలి విజయాన్ని నమోదుచేసింది. మెహదీపట్నం స్థానం నుండి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్ధి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. హుస్సేన్ 2012-14 వరకు జిహెచ్ఎంసి మేయర్ గా పనిచేయడం విశేషం.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో అత్యంత తక్కువ ఓట్లు పోలైన మెహదీపట్నం ఫలితం మొదటగా వెలువడింది. మెహదీపట్నంలో 11,818 ఓట్లు నమోదయ్యారు. మొదటి రౌండులోనే ఫలితం వెలువడింది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ మొదటి స్థానంలో కొనసాగింది. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు, మూడు స్థానాల్లో కొనసాగాయి. తర్వాత బ్యాలెట్ లెక్కింపు మొదలవగానే టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతుంది. తర్వాతి స్థానంలో బీజేపి, ఎంఐఎం కొనసాగుతున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఊహించని ఫలితాలు అందుకోబోతుందా అనిపిస్తుంది. టీఆర్ఎస్ కు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు.
Must Read ;- ఎంఐఎం కోటలో బీజేపీ హవా?.. ఆధిక్యంలో కమలనాథులు!











