జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం తొలిరౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ రౌండ్‌లోలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. ఆర్సీపురం, పఠాన్‌చెరు, చందానగర్, హైదర్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్‌తో పాటు మరికొన్ని డివిజన్లలలో టీఆర్ఎస్ పార్టీ ముందుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడిన కారు తొలి రౌండ్ ఫలితాలు ప్రారంభమయ్యే సరికి వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు మొత్తంగా 31 డివిజన్లలో టీఆర్ఎస్, 12 చోట్ల బీజేపీ, 7 డివిజన్లలో ఎంఐఎం పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
స్పీడ్ పెంచిన కారు…
గ్రేటర్‌లోని 150 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచే కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 28 వేల లోపు ఓట్లు ఉంటే ఆ డివిజన్‌లలో రెండు రౌండ్లలో ఫలితాలు వెలువడిస్తారు. 28వేలకు పైగా ఓట్ల లెక్కింపు ఉంటే మూడు రౌండ్లలో ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధిక డివిజన్లలో 28వేల లోపు మాత్రమే ఓట్లు పోలయ్యాయి. మరికొద్ది సేపట్లో తొలి రౌండ్ ఫలితాలు పూర్తిగా వెలువడనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తన కారు స్పీడ్‌ను పెంచింది. మెజార్టీ డివిజన్ల ఆధిక్యంతో గులాబీ గుబాళిస్తోంది. మొత్తం 74 లక్షల మంది ఓటర్లుగా నమోదైతే అందులో దాదాపు 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1122 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
టీఆర్ఎస్ 32, బీజేపీ 12 చోట్ల ఆధిక్యం…
ఆర్సీపురం, పటాన్‌చెరు, చందానగర్, హఫీజ్‌పేట్, హైదర్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్, చర్లపల్లి, కాప్రా, మీర్‌పేట్, శేరిలింగంపల్లి, గాజులరామారం, రంగారెడ్డితో పాటు మరి కొన్ని డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొత్తంగా 31 డివిజన్లలో టీఆర్ఎస్ హవా కొనసాగుతుంటే బీజేపీ జోరు మాత్రం 12 డివిజన్లలో సాగుతోంది. ఎంఐఎం పార్టీ ఏడు డివిజన్లలో, కాంగ్రెస్ పార్టీ ఒక డివిజన్‌లో ఆధిక్యం కనబరుస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరిగా సాగుతోంది. ఇంకా పూర్తి ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Must Read ;- బల్దియా తొలి ఫలితం వచ్చేసింది!