మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాశరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకధీరుడు రాజమౌళి ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. పక్కా ప్లాన్ తో షూటింగ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఈ మూవీ షూటింగ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ.. విషయం ఏంటంటే.. ఫిబ్రవరికి షూటింగ్ కంప్లీట్ అవుతుందని.. ఆతర్వాత నుంచి వేరే సినిమాల్లో నటించవచ్చు అని చరణ్ కి రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారని తెలిసింది.
తండ్రి చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల షూటింగ్ లో చిరంజీవి జాయిన్ అయ్యారు. అయితే.. తండ్రికొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి ఆచార్య మూవీలో నటిస్తుండడంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా..? ఎప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తారా..? అని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కరోనా లేకపోతే ఈపాటికే ఆచార్య థియేటర్లోకి వచ్చి ఉండేది.
Also Read ;- చిత్తూరు యాసలో చితక్కొడుతోన్న కన్నడ బ్యూటీ.. !
ఇందులో రామ్ చరణ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారని టాక్ . దాదాపు అరగంట సేపు చరణ్ పాత్ర ఉంటుందని తెలిసింది. అయితే.. చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఫిక్స్ కాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు వినిపించింది. అమ్మడు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందుచేత ఈ బాలీవుడ్ బ్యూటీనే ఎంపిక చేస్తారనుకున్నారు. ఈ బ్యూటీని కాంటాక్ట్ చేయడం కూడా జరిగిందట.
అయితే.. కియారా అద్వానీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అందుచేత ‘ఆచార్య’ మూవీలో చరణ్ సరసన నటించేందుకు నో చెప్పిందట. అయితే ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రష్మిక పేరు వినిపిస్తోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది. ఈ అమ్మడునే ఫిక్స్ చేశారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- విలన్ విషయం సుకుమార్ ఇంకా తేల్చలేదట!











