నరసాపురం ఎంపీ రాఘురామరాజు కేసు రోజురోజుకూ మలుపు తిరుగుతోంది. ఆయనను అరెస్ట్ చేసిన నాటి నుంచే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రఘురామరాజుకు ఇతర పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడం.. ఆయన పేరిట అభిమానులు పోస్టర్లు వేయడం.. రఘురామరాజు పోలీసులు, సీఐడీ అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేయడం, గుంటూరు నుంచి సికింద్రాబాద్ తరలించడం లాంటివన్నీ హాట్ టాపిక్ గా మారాయి. అయితే రఘురామ అరెస్ట్ తీరును నిరసిస్తూ కుటుంబ సభ్యలు ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహానీ ఉందని రఘురామ రాజు భార్య చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
తండ్రిని చూడకుండానే…
ఈ నేపథ్యంలో మంగళవారం రఘురామరాజు కూమారుడు భరత్ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్నాడు. తన తండ్రిని చూడాలని ఆర్మీ అధికారులను వేడుకున్నాడు. ఇందుకు ఎలాంటి అనుమతి లేదని భరత్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు చేసేదేమీక భరత్ తన తండ్రి రఘురామరాజును చూడకుండానే వెనుతిరిగాడు. కాగా రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించగా, నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- ‘అమిత్ షా అనుమతితోనే రఘురామ అరెస్ట్‘ : సీపీఐ నేత నారాయణ కామెంట్స్!











