అనర్హత వేటు క్లారిటీపై ఎంపీ రఘురామ డిమాండ్
‘అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్ కు టైం ఇస్తున్నాను .. ఏం చేయ్యలనుకున్న చేయ్యండి’ అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. అమరావతి రైతుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం, మంత్రి వివేక హత్య కేసు, జిల్లాల పునర్విభజన, రాష్ట్రంలో డ్రగ్స్ సర్క్యూలేట్ వంటి అనేక విషయాలను ఆయన ఢిల్లీ మీడియాతో పంచుకున్నారు. రాజధాని విషయంలో మోసం చేసిన ప్రభుత్వంపై రైతులు కేసు పెట్టాలని పిలుపునిచ్చారు. ఏపీలో మూడు రాజధానులు తెచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానం అమరావతి రైతులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడితే.. ప్రభుత్వం దిగి వస్తోందని, తద్వారా అందాల్సిన ప్రయోజనాలను పొందుతారని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో దర్యాప్తులో పురోగతి రావోచ్చన్నారు. వైసీపీ నేత శివశంకర్ రెడ్డి తరుపున ప్రభుత్వ లాయర్ చంద్ర ఓబుల్ రెడ్డి వాదించారని, ప్రభుత్వ తరుపు న్యాయవాది పార్టీకి, నాయకుడి తరుపున కేసు ఎలా వాదిస్తారు? అని రఘురామ ప్రశ్నించారు. చంద్ర ఓబుల్ రెడ్డిపై బార్ కౌన్సిల్ చైర్మన్ కి లేఖ రాశానని తెలిపారు. జిల్లాల పునర్విభజన విషయంలో వైసీపీ కేడర్ కూడా మండిపడుతోందన్నారు. డ్రగ్స్ నియంత్రణపై జగన్ సమీక్ష నిర్వహించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.











