టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు గంటలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఉత్తుత్తి రాజీనామాలతో సొంగ గంట మోగిస్తున్నారని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. గంటా శ్రీనివాసరావు అనే పేరు ఎత్తకుండానే ఆయనపై సెటైర్లు వేశారు. ఆ గంటతో రణగొణధ్వనులు తప్ప వారికి చిత్తశుద్ది లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆ గంట శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు, అసలు ఉద్యమకారులకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఆ గంటే గతంలో విశాఖలో భూ గంట మోగించలేదా అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
గతంలో గంటా విశాఖలో భూ కబ్జాలకు పాల్పడ్డాడని విజయసాయి చెప్పకనే చెప్పారు. భూగంట మోగించాడంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి విమర్శలు పరిశీలిస్తే గంటా శ్రీనివాసరావును ఇక వైసీపీలోకి తీసుకునే అవకాశాలు దాదాపు కనుమరుగయినట్టేననే విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- జీవీఎంసీలో గంటాది వైఫల్యమా.. పార్టీ వీడే ఆలోచనా..?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు "గంటలు" కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో సొంత "గంట" మోగిస్తున్నారు. ఆ "గంట"లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ "గంట" శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో "భూగంట" మోగించలేదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 22, 2021











