స్టాక్ మార్కెట్ తలుచుకుంటే అపర కుబేరుల పరిస్ధితి తల్లకిందులు చేసి రోడ్డు మీదకు తెచ్చేయగలదు. అదే స్టాక్ మార్కెట్ అనుకూలిస్తే.. కుబేర కిటీరాన్ని అందుకోవచ్చు. రెండు నెలల క్రితం ఆసియా ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన ముఖేశ్ అంబాని .. తాజాగా మళ్లీ నెం.1గా అవతరించారు.
దీంతో.. చైనా పారిశ్రామిక వేత్త జాంగ్ షాన్షాన్ రెండో స్థానానికి పడిపోయారు. ఈ వారంలో మన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, రిలయన్స్ షేర్లపై అంతగా ప్రభావం చూపకపోవడం అంబానీకి కలిసివచ్చింది. దీని వల్ల ముఖేశ్ ఆస్తుల విలువ నిలకడగా కొనసాగగా.. షాన్షాన్ ఆస్తి మాత్రం 22 శాతం క్షీణించి 7,660 కోట్ల డాలర్లకు పడిపోయింది. ముఖేశ్ అంబానీ సంపద 8,000 కోట్ల డాలర్లతో పోలిస్తే షాన్షాన్ ఆస్తి తగ్గడంతో.. ఆయన రెండో స్థానానికి పడిపోయారు. ఈ వారం రెండేళ్ల క్రితం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కి నెట్టి ముఖేశ్ అంబానీ తొలిసారిగా ఆసియా నెం.1గా అవతరించారు.
Must Read ;- ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలున్న వాహనం పార్కింగ్..