ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతున్న 69వ జాతీయ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన వర్చ్యువల్ విధానంలో జగన్ పాల్గొన్నారు. కొవిడ్ తో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానం ఇంకెన్ని నెలలు కొనసాగుతుందో తెలియడం లేదని, పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం.. దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఏ విధమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలో సూచించాలని నిపుణులను కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలతో పాటు ఇళ్ల అద్దెలు కూడా గణనీయంగా పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరమవుతోందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ఏం చేయాలో చెప్పాలని కోరారు.
వీరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలంటే.. భూ సేకరణ పెనుభారంగా మారిందని, ఈ సమస్య పరిష్కారానికి ఉపకరించే సూచనలు ఇవ్వాలని అడిగారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పన కష్టమవుతోందన్న సీఎం జగన్ .. ఇందుకు గాను పక్కా ప్రణాళిక రూపొందించాలని కోరారు. మనకున్న విస్తారమైన 974కిలోమీటర్ల తీర ప్రాంతం.. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదని, అందువల్ల ఈ మొత్తం తీరంతో పాటు విశాఖ పురోగతికి తోడ్పడే సలహాలనివ్వాలని నిపుణులకు సూచించారు.
Must Read ;- ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం