సోనుసూద్.. అంటే మంచితనానికి మరో పేరు. ఇంకా చెప్పాలంటే.. మనిషి రూపంలో ఉన్న దేవుడు. అలాంటిది సోను సూద్ పై కేసు పెట్టండి ఏంటి..? ఆయన చేసిన తప్పేంటి..? అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే.. బృహన్ ముంబై కార్పొరేషన్ ఆయన పై పోలీస్ కేసు పెట్టింది. కారణం ఏంటంటే… సోను సూద్ జుహూ ప్రాంతలో ఉన్న తన ఆరు అంతస్థుల భవాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారని సీరియస్ అయ్యింది.
దీంతో కార్పోరేషన్ అధికారులు జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయన పై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే… ఈ ఆరోపణలను సోను సూద్ ఖండించారు. తన ఆరు అంతస్ధుల భవనాన్ని హాటల్ గా మార్చేందుకు బీఎంసీ నుంచి ఛేంజ్ ఆప్ యూజర్ అనుమతులు తీసుకున్నానని తెలియచేశారు.
అంతే కాకుండా.. తాను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని… బీఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నానని.. ఒక్క మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందని సోను సూద్ తెలియచేసారు. కోవిడ్ నేపథ్యంలో MCZMA నుంచి అనుమతి ఆలస్యమవుతోందని ఆయన చెప్పారు. అయితే… బీఎంసీ ఫిర్యాదు పై ప్రాథమిక విచారణ చేస్తామని.. ఆ తర్వాతే ఎప్ఐఆర్ నమోదు చేస్తామని జుహూ పోలీసులు వెల్లడించారు. సేవా కార్యక్రమాలతో సోను సూద్ కు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేకే ఇలా ఆయన పై విమర్శలు చేస్తున్నారని.. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
Must Read ;- రైతుగా రాబోతున్న సోనుసూద్