“సోలో బ్రతుకే సో బెటర్” చిత్రంహైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ , పి.వి.ఆర్. వంటి అనేక మల్టీఫ్లెక్స్ ల్లోనూ, సుదర్శన్ 35 ఎం. తో పాటు పలు సింగిల్ థియేటర్లోనూ విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 50 శాతం సీటింగ్ కు తగ్గట్టుగా ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత భారీగా విడుదలైన తొలి చిత్రమిదే కావడంతో మళ్లీ రియల్ సినిమాను చూసే అవకాశం లభించిందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని కలెక్షన్లను పరిశీలించిన అనంతరం థియేటర్లకు వస్తున్న ప్రేక్షక స్పందనను మరింతగా విశ్లేషించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగరంలో మాత్రం శుక్రవారం ఉదయం మళ్లీ థియేటర్లు కళ కళ లాడుతూ కనిపించాయి.
@IamSaiDharamTej సినిమా ఇండస్ట్రీ తరపున first warrior.. కోట్ల మంది సినీ ప్రియుల మనసులు గెలుస్తావని నాకు తెలుసు..Al the best my boy👍😘
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 24, 2020
ఇదిలావుండగా..రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు “సోలో బ్రతుకే సో బెటర్” చిత్రంత్తొ తిరిగి తెరుచుకోవడంతో రియల్ సినిమా వచ్చిందంటూ పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఆ చిత్ర హీరో సాయిధరమ్ తేజ్ కు, అలాగే చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేస్తూ, సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు, హీరోలు నందమూరి కల్యాణ్ రామ్, రామ్ పోతినేని, మంచు మనోజ్, దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్, మారుతి, దేవ కట్టా వెంకీ అట్లూరి, నిర్మాతలు మహేష్ కోనేరు తదితరులు అభినందనలు అందజేసినవారిలో ఉన్నారు. ఇంకా డి.వి.వి. దానయ్య కు చెందిన డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, యూవీ క్రియేషన్స్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు కూడా శుభాకాంక్షలు తెలిపాయి.
Must Read ;- ‘సోలో బ్రతుకు’ కు సోల్ అదే (రివ్యూ)
The REAL cinema experience is back with a new normal!!
There couldn’t be a happier news for all movie lovers…🙂
Kudos to Prasad garu, @IamSaiDharamTej for bringing their #SoloBrathukeSoBetter as the first big release after the reopening of theatres👏🏻.
Best wishes to the team.:)— rajamouli ss (@ssrajamouli) December 25, 2020
Wishing everyone a very Merry Christmas. And best wishes to @IamSaiDharamTej and team for #SoloBrathukeSoBetter. Let us welcome the first Telugu film to hit the theaters after lockdown
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 25, 2020