అక్కినేని నాగచైతన్య ఒకప్పుడు సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండేవాడు కాదు. అయితే.. ఈమధ్య చైతన్య ఆలోచనా విధానం మారినట్టుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నాడు. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నాడు. పర్సనల్ విషయాలను షేర్ చేయడానికి అంతగా ఇష్టపడని నాగచైతన్య తనకు ఇష్టమైన పుస్తకం. తనలో స్పూర్తి నింపింది అంటూ పర్సనల్ విషయాలు గురించి కూడా చెబుతున్నాడు. నిజంగా చైతన్యలో వచ్చిన మార్పు ఇది.
అయితే… తన సినిమాలను ప్రోమోట్ చేసేందుకు ట్విట్టర్ ని ఎక్కువ ఉపయోగిస్తున్నాడు నాగ చైతన్య. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం పెద్దగా యాక్టివిటీ లేదు. నాగ చైతన్య ఇప్పటికే హీరోగా ఫుల్ బిజీగ ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు ప్రమోషన్ కి ఇదే బెస్ట్ పద్దతి అని గ్రహించినట్లున్నాడు. వరుసగా ట్వీట్లు వేస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. తండ్రి నాగార్జునతో కలిసి నాగచైతన్య నటిస్తున్న బంగార్రాజు చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు.
బంగార్రాజు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే బంగార్రాజు రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. బంగార్రాజు సినిమాతో పాటు థ్యాంక్యూ మూవీ కూడా చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న థ్యాంక్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దాలో కూడా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇలా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చైతన్య. ఈ మూడు సినిమాలు మూడు నెలల గ్యాప్ లోనే విడుదల కానున్నాయని సమాచారం.
Must Read ;- మరింత స్పీడు పెంచిన బంగార్రాజు











